Skip to main content

‘ఏకమ్’ (ది జర్నీ ఆఫ్ ఎ జాబ్ లెస్ గాడ్ ) చిత్ర టీజర్ విడుదల

సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద థాట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’. ఈ చిత్రం ద్వారా వరుణ్ వంశీ దర్శకుడిగా పరిచయం కాగా కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివుడి మూల కతఅంశం తో తెరకెక్కించిన ఈ నూతన చిత్ర టీజర్ ను ‘మా’ అధ్యక్షుడు నరేష్, బ్యానర్ ను నిర్మాత రాజ్ కందుకూరి మరియు అనిల్ సుంకర లు శనివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రంలో మొదట నరేష్ మాట్లాడుతూ.. డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ ‘ఏకమ్’ చిత్రం కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్ గా కనబడుతోంది. ప్రతి జెనెరేషన్ కు కనెక్ట్ అయ్యేలా కూడా కనపడుతోంది. అందరికీ బెస్ట్ విషెస్ ను తెలువుతున్నానని అన్నారు. హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ.. న్యూ జోనర్, క్లాసికల్ చిత్రం గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. వరుణ్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారని అన్నారు. డైరెక్టర్ వరుణ్ వంశీ మాట్లాడుతూ.. కళ్యాణ్ శాస్త్రి గారు నాకు 11 ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన నా గురువు కూడా.. ఓ రోజు నా దగ్గర ఓ కథ ఉంది, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నానని కళ్యాణ్ గారికి చెప్పాను. కథ విని ఎవరో ఎందుకు మనమే చేద్దాం అని నాకు ప్రామిస్ చేశారు. అలా ఈ సినిమా మొదలైంది. సినిమా ఇండస్ట్రీ లోనికి రాకముందు చాలా ఈజీ అనుకున్నాను. కానీ సినిమా మొదలు పెట్టక తెలిసింది అంత ఈజీ గా స్టార్స్ అవరని. ఇక ఏకమ్ సినిమా విషయానికి వస్తే న్యూ జోనర్, పంచభూతాల ఆధారంగా సినిమా స్టోరీ ఉంటుంది. మిగతా విషయాలు మున్ముందు కార్యక్రమంలో తెలుపుతున్నానన్నారు. నిర్మాత కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ… మా అమ్మాయి పేరు సంస్కృతి. తన పేరునే ఈ బ్యానర్ ను స్థాపించడం జరిగింది. అందుకు కారణం మాత్రం వరుణ్. అతను నా శిష్యుడు. చిన్నప్పటి నుంచీ తను కథలు బాగా చెప్పేవాడు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా చూపించాలనే తపన, టాలెంట్ వరుణ్ కు ఉన్నాయి. అదే నమ్మకం నన్ను ప్రొడక్షన్ వైపు నడిపించింది. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫిలాసఫిల్ ఫిక్షన్ గా మా ఏకమ్ చిత్రం రాబోతోంది. నిర్మాత కంటే అతి జాగ్రత్తగా సినిమాను తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా తెరకెక్కించారు మా దర్శకుడు వరుణ్. ఈ సినిమాలో అందరూ బాగా నటించారు. తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.

రాజ్ కందుకూరి, అనిల్ సుంకర, కాశీ విశ్వనాథ్, అదితి, కల్పిక, సుక్కు, దయా, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలు, అభిప్రాయాలను పంచుకున్నారు.

అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, దయానంద్ రెడ్డి, కల్పిక గణేష్, లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: జోస్ ఫ్రాంక్లిన్, డిఓపి: ఇక్బాల్ ఆజ్మి, లిరిక్స్: రఘు చతురెదుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, నిర్మాతలు: ఎ. కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్., శ్రీరామ్ కె., డైరెక్టర్: బి. వరుణ్ వంశీ



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2PGnw4N

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...