Skip to main content

తారకరత్న కథానాయకుడిగా దేవినేని నెహ్రూ బయోపిక్ ప్రారంభం

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. “దేవినేని” టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో
రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై దేవినేని నెహ్రూ బయోపిక్ గా తీస్తొన్న ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేయ‌గా సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావుగారు ఫ‌స్ట్ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో

ద‌ర్శ‌కుడు శివ‌నాగు మాట్లాడుతూ… ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నంద‌మూరి తార‌క్‌గారు పోషించ‌గా మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో పెద్ద ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. నేను ఈ సినిమా చేద్దాం అనుకునే ముందు విజ‌య‌వాడ మొత్తం తిరిగి అంద‌ర్నీ క‌లిసి తెలుసుకున్నాను. గ‌తంలో ఒక‌సారి ఈ క‌థ గురించి నెహ్రూగారిని కూడా క‌లిశాను. కానీ ఆయ‌న అప్పుడు ఎందుకు శివా అన‌వ‌స‌రంగా కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నారు. మీకు ఇంత‌కు మించిన క‌థ‌లు లేవా అని అన్నారు. కానీ నేను అలా కాదు నేను మీరు నాయ‌కుడుగా ఎన్నో మంచి ప‌నులు చేశారు వాటి గురించి చాలా మందికి తెలియ‌డం కోసం చేస్తున్నాను అని అన్నాను. ఒక‌సారి క‌థ చెప్పాను ఆయ‌న‌కు విని ఓకే చెయ్య‌మ‌న్నారు. ఆ త‌రువాత అనుకోకుండా ఆయ‌న చ‌నిపోవ‌డం జ‌రిగింది. త‌ర్వాత తార‌క్‌గారికి ఈ క‌థ చెప్ప‌గానే ఓకే అన్నారు. అని కొన్ని మార్పులు చెప్పారు. న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మా జ‌మున‌మ్మ‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. మార్పు చేసి చెప్ప‌గానే ఓకే అన్నారు. మే 10నుంచి రెగుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ద‌స‌రాకి విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నాం. ఈ క‌థ 1977లోని క‌థ‌. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ అనుకుంటున్నాం అని అన్నారు.

హీరో తార‌క్ మాట్లాడుతూ… మా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితులైన వ్య‌క్తి. పెద‌నాన్న‌గారిలాంటివారు. ఆయ‌న పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కులు శివ‌నాగుగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ఆయ‌న ఎన్నో మంచి చిత్రాల‌ను తీశారు. ఈ సినిమాకి రాముగారిలాంటి మంచి ప్రొడ్యూస‌ర్ దొర‌క‌డం మా అదృష్టం. ఈ సినిమా మంచి హిట్ అయి ప్రొడ్యూస‌ర్‌కి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. మా అమ్మ జ‌మున చేతుల మీదుగా ఈ సినిమా రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… దేవినేని చిత్రానికి ప్రొడ్యూస్ చెయ్య‌డం నా అదృష్టం. ఆయ‌న ఇక్క‌డ లేక‌పోయినా పైలోకాల నుంచి న‌న్ను ఆశీర్వ‌దిస్తారు. ఆయ‌న పై నుంచి ఇచ్చే పుష్ఫింగ్‌తో ఈ సినిమాని ఇంత దూరం ఈసుకొచ్చాం. శివ‌శ‌క్తి మంచి క‌సి ఉన్న ద‌ర్శ‌కుడు. ఆయ‌న దొర‌క‌డం మా అదృష్టం ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. జ‌మున‌మ్మ ప‌క్క‌న కూర్చోవ‌డ‌మే నా అదృష్టం. ఆమెకు నా మ‌న‌స్సుమాంజ‌లి అని అన్నారు.

జ‌మున మాట్లాడుతూ… శివ‌నాగు నాకు ద‌త్త పుత్రుడు లాంటివాడు. చాలా పెద్ద పెద్ద హీరోల‌తో చేశారు. కృష్ణ‌, చిరంజీవి లాంటి పెద్ద వారితో చేసి ఎన్నోజ‌య‌ప్ర‌ద‌వంత‌మైన చిత్రాల‌ను తీశారు. నేను సినిమారంగం నుంచి త‌ప్పుకుని 30 ఏళ్ళు అయింది. త‌రువాత రాజ‌కీయ‌ల్లోకి వెళ్ళి నాయ‌కురాలిగా కూడా చేశాను. ప్ర‌స్తుతం రిటైర్ అయిన న‌న్ను మ‌ళ్ళీ కెమెరా ముందు నిల‌బెట్టి సినిమా రంగులు వేసి న‌టించేలా చేశారు శివ‌నాగు. అన్న‌పూర్ణ‌మ్మ గారి సినిమాలో నేను న‌టిస్తున్నాను. అందులో ఒక రాణి పాత్ర‌కోసం తీసుకున్నారు. 30 ఏళ్ళ త‌ర్వాత నాకు సినిమా రంగులు పూసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌నత ఆయ‌న‌దే అన్నారు. నేను ఆయ‌న‌లో మెచ్చిన‌ది ఒక‌టే ఆయ‌న విన‌య‌విధేయ గౌర‌వం. ఇక ఈ సినిమా చాలా మంచి క‌థ‌. దేవినేని గారు చేసిన ప్ర‌జాహిత ప‌నులు గురించి చెప్ప‌డం మంచి క‌థ ఇది. ఆయ‌న్ని ప్రోత్స‌హించిన ప్రొడ్యూస‌ర్‌గారికి ఆ పాత్ర‌లో న‌టిస్తున్న తార‌క్‌ర‌త్న‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నందమూరి తారక రత్న, నాగినీడు, నాజర్, జయప్రకాష్ రెడ్డి , పృథ్వీ, చల్లా సుబ్రమణ్యం,శివా రెడ్డి,
శ్రీహర్ష, అజయ్ , బెనర్జీ, జీవా, అన్నపూర్ణమ్మ, సుహాసిని, సుధ ,తేజ ( తొలి పరిచయం) తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి కెమెరా: గిరి కుమార్ , కూర్పు: కె.ఎస్. వాసు, కో- డైరక్టర్: కంబాల శ్రీనివాస్, పి.ఆర్.ఓ : సాయి సతీష్ , నిర్మాత: రాము రాథోడ్ , కథ-మాటలు- దర్శకత్వం: నర్రా శివ నాగేశ్వరరావు (శివ నాగు).



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GvmODe

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...