Skip to main content

మయూఖ టాకీస్” యాక్టింగ్ స్కూల్ ప్రారంభించిన పూరి జగన్నాధ్

“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు
నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న “మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ ” మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది” అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్.
ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో “మయూఖా టాకీస్” యాక్టింగ్ స్కూల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పూరి జగన్నాథ్.

ప్రముఖ నటుడు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ ఉత్తేజ్ ప్రారంభించిన “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” ప్రారంభోత్సవానికి పూరి జగన్నాథ్, ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత రామకృష్ణ వీరపనేని, ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు తదితరులు హాజరయ్యారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఉత్తేజ్ మాట్లాడుతూ” అత్యుత్తమ ప్రమాణాలతో ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్
ప్రారంభించాలనే కోరిక ఎప్పటినుంచో ఉన్నప్పటికీ సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ సక్సెస్ అవుతాయి… అలాంటి ఫ్యాకల్టీ దొరికింది కాబట్టే ఈరోజు “మయూఖ ఫిలిం యాక్టింగ్ స్కూల్ ” ను ప్రారంభిస్తున్నాను. “ఇలాంటి యాక్టింగ్ స్కూల్ ఒకటి ప్రారంభించు.. మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి అని పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, సురేందర్ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందిని రెడ్డి వంటి ప్రముఖ దర్శకులు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారి ప్రోత్సాహ బలంతోనే ఈ రోజున ఈ యాక్టింగ్ స్కూల్ ప్రారంభిస్తున్నాను.
నా ప్రయత్నాన్ని అభినందిస్తూ వీరందరూ ఇచ్చిన మెసేజ్ లు చూసి ఇంకా ఎంతోమంది సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అల్లు శిరీష్ స్వయంగా ఫోన్ చేసి నేను ఇనిస్టిట్యూట్లో చేరతాను అని ముందుకు రావటం, అల్లు అర్జున్ గారు వీలు చూసుకుని తప్పకుండా ఒకరోజు స్కూల్ కు వస్తాను… మీ స్టూడెంట్స్ తో, ఫ్యాకల్టీతో కొంత టైం స్పెండ్ చేస్తాను”- అని చెప్పటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నుండి ప్రారంభమయ్యే తొలి బ్యాచ్ క్లాసెస్ రెండు నెలల పాటు జరుగుతాయి. వ్యక్తిగతంగా ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ ఫోకస్ చేయటం కోసం 32 అప్లికేషన్స్ వచ్చినప్పటికీ బ్యాచ్ కి కేవలం 18 మంది స్టూడెంట్స్ ను మాత్రమే తీసుకున్నాము. దీంతో ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ పూర్తయ్యాయి. పూరి జగన్నాథ్ గారు, జెడి చక్రవర్తి గారు, లక్ష్మీ భూపాల్ గారు, నడిమింటి నరసింహారావు, జర్నలిస్ట్ ప్రభు గారు తదితర ప్రముఖులు అందరు విచ్చేసి మా మయూఖ యాక్టింగ్ స్కూల్ కు తమ అంద దండలు ఉంటాయని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు” అన్నారు.

ముఖ్య అతిథి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “ఉత్తేజ్ గత 32 ఏళ్లుగా
నాకు మంచి మిత్రుడు. నన్ను రాంగోపాల్ వర్మ గారికి పరిచయం చేసి నేను దర్శకుడు కావటానికి కారకుడైన ఉత్తేజ్ ఈరోజు యాక్టింగ్ స్కూల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాక్టింగ్ కోచ్ గా ఉత్తేజ్ కు ఉన్న అనుభవం అపారం. మా అబ్బాయి ఆకాష్ కు కూడా ఉత్తేజ్ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించాను. ఉత్తేజ్ ప్రారంభించిన ఈ యాక్టింగ్ స్కూల్ కు నా అండదండలు పూర్తిగా ఉంటాయని హామీ ఇస్తున్నాను” అన్నారు.

ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ “నా చిరకాల మిత్రుడైన ఉత్తేజ్ లో మంచి నటుడే కాదు.. మంచి దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు. మంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో తను ఇచ్చే శిక్షణ ఫాలో అయితే మీరంతా నటనలో తప్పకుండా గొప్పగా రాణిస్తారు. మంచి స్టాండర్డ్స్ తో, క్రమశిక్షణతో ప్రారంభమైన ఈ “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” అతి త్వరలోనే ఒక అగ్రశ్రేణి ఫిలిం ఇనిస్టిట్యూట్ గా ఎదుగుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత “వీరపనేని రామకృష్ణ” మాట్లాడుతూ – ” ఉత్తేజ్ ఒక మంచి నటుడిగా, మంచి మిత్రుడిగా నాకు చాలా కాలం నుండి పరిచయం. తను ప్రారంభించిన “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్” కు అన్ని విధాల నా అండదండలు ఉంటాయి” – అన్నారు.
ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సీనియర్ రైటర్ నడిమింటి నరసింహారావు తదితరులు తమ ప్రసంగాలలో
” మయూఖా టాకీస్ యాక్టింగ్” స్కూల్
పురోభివృద్ధిని ఆకాంక్షించారు.

నటన పట్ల ఆసక్తి తో వచ్చే స్టూడెంట్స్ అవసరాన్ని క్యాష్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ప్రమాణాలతో, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో యాక్టింగ్ స్కూల్ ను ప్రారంభిస్తున్న ఉత్తేజ్ కు ఫిలిం ఇండస్ట్రీ నుండి పూర్తి సాయి మద్దతు లభిస్తుంది అనటంలో సందేహం లేదు.
కార్యక్రమం చివరిలో ఇటీవల దివంగతులైన ప్రముఖ నటులు, నట శిక్షకులు “దీక్షితులు” ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. చివరిగా
తమ “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్ ” ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి అభినందనలు తెలిపిన అందరికీ ఉత్తేజ్ కృతజ్ఞతలు చెప్పారు. మయూఖ టాకీస్” యాక్టింగ్ స్కూల్ ప్రారంభించిన పూరి జగన్నాధ్

తమ “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్ ” ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి అభినందనలు తెలిపిన అందరికీ ఉత్తేజ్ కృతజ్ఞతలు చెప్పారు.

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UTktMe

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...