Skip to main content

చెలియా ఉంటానే’ పాట అనుపమా పరమేశ్వరన్ వల్లే సాధ్యమైంది: గాయకుడు యాజిన్ నిజార్

గాయకుడు యాజిన్ నిజార్ పేరు, అతను పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘శీతాకాలం సూర్యుడిలా…’, ‘లోఫర్’లో ‘జియా జలే జలే’, ‘కుమారి 21ఎఫ్’లో ‘మేఘాలు లేకున్నా…’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో ‘చిరునామా తన చిరునామా’, ‘వున్నది ఒకటే జిందగీ’లో ‘లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో’, ‘భరత్ అనే నేను’లో ‘ఓ వసుమతి ఓ వసుమతి’, ‘118’లో ‘చందమామే’, ‘బాహుబలి‘లో ‘బలి బలి రా బలి’ వంటి హిట్ పాటలను పాడినది ఇతనే. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్,రవితేజ, నందమూరి కల్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలకు, రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలకు పాటలు పాడారు. మలయాళ, తమిళ సినిమాల్లో పలు పాటలు పాడిన యాజిన్ నిజార్ తాజాగా ‘చెలియా ఉంటానే’ అని ఓ మ్యూజిక్ సింగిల్ చేశారు.

యాజిన్ నిజార్ పాడిన, నటించిన మ్యూజిక్ వీడియో ‘చెలియా ఉంటానే’. నీరో సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ తొలిసారి నటించిన మ్యూజిక్ వీడియో ఇదే. ఆదిత్య మ్యూజిక్ ఒరిజినల్స్ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాట విడుదలైంది. తెలుగు వెర్షన్ ‘చెలియా ఉంటానే’కి మౌనిక సాహిత్యం అందించగా… తమిళ్ వెర్షన్ ‘ఉయిరే ఉన్నోడు’కు నీరో సాహిత్యం అందించారు. ఇంగ్లీష్ లిరిక్స్ రాసినది, పాడినది అలెన్ బాబు డేనియల్.

– ఇంతకు ముందు నేను ఒక మ్యూజిక్ సింగల్ ‘నీవే’ చేశా. అందులో నేను నటించలేదు. కానీ, పాడింది నేనే. అదీ, ఇప్పుడీ ‘చెలియా ఉంటానే’… రెండు పాటలు తెలుగు, తమిళ భాషల్లో చేశాం.

– ‘చెలియా ఉంటానే’కి వస్తే… ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు వచ్చిన ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ నీరో, నేను ఒక జామ్ సెషన్ లో కలిసినప్పుడు ఈ సాంగ్ ఐడియా స్టార్ట్ అయ్యింది. తరవాత నీరో ఫ్రెండ్ అలెన్ బాబు డేనియల్ మాతో జాయిన్ అయ్యారు. అప్పుడు మ్యూజిక్ వీడియో చేద్దామనే ఐడియా లేదు. యాక్చువల్లీ… అనుపమా పరమేశ్వరన్ కూడా చాలా సపోర్ట్ చేసింది. తనకు పాట నచ్చింది. మ్యూజిక్ వీడియోలో నటిస్తానని చెప్పింది. మేమంతా స‌ర్‌ప్రైజ్ అయ్యాం. చాలా సంతోషించాం. అప్పుడు మ్యూజిక్ వీడియో ఎందుకు చేయకూడదని ఒక ఐడియా వచ్చింది. తన బిజీ షెడ్యూల్ లోనూ అనుపమా పరమేశ్వరన్ మాకు డేట్స్ ఇచ్చి షూటింగ్ చేసింది. మా టీమ్ అందరి సపోర్ట్, ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో ఇది సాధ్యమైంది.

– నాకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఉన్నవాళ్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. తను పాట విని చేస్తానని అనడంతో మేమంతా ఎగ్జాయిట్ అయ్యాం. ఇప్పటివరకూ అనుపమ సినిమాల్లో మాత్రమే నటించింది. మ్యూజిక్ వీడియో చేయదమిదే తొలిసారి. తనకు చాలా చాలా థాంక్స్. రెండు రోజుల్లో ఈ పాట షూటింగ్ పూర్తి చేశాం. చిక్ మంగళూర్, తెలంగాణలో కొన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ఇదొక సింపుల్ లవ్ సాంగ్. ఇద్దరు ఒక ప్రయాణంలో కలుస్తారు.

– నేను కెమెరా ముందుకొచ్చిన తొలి తెలుగు పాట ఇది. తొలిసారి తెలుగులో నటించా. ఇంతకు ముందు మలయాళ సినిమా ‘యాంగ్రీ బేబీస్’లో నేను పాడిన పాటలో కనిపించాను. నాలో యాక్టింగ్ టాలెంట్ లేదు. నేను కొంచెం కెమెరా షై. దాంతో టెన్షన్ పడ్డాను. ఇదొక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్.

– ఆదిత్య మ్యూజిక్ వంటి గొప్ప సంస్థ సినిమాలతో పాటు మ్యూజిక్ ఆర్టిస్ట్స్, వీడియోలను సపోర్ట్ చేయడం ఒక పాజిటివ్ సైన్. ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో మరింతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారని ఆశిస్తున్నా. తెలుగులో నేను పాడిన పాటల్లో ఎక్కువ హిట్ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఈ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది.

– తెలుగులో త్వరలో విడుదల కానున్న ‘మహర్షి’లో ‘నువ్వే సమస్తం’ పాట పాడాను. మహేష్ బాబు గారికి నేను పాట పాడటం ఇది మూడోసారి. ఇంతకు ముందు ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో పాటలు పాడాను. మహేష్ సార్, దేవిశ్రీ ప్రసాద్ సార్ కాంబినేషన్లో మూడోసారి అవకాశం రావడం సంతోషంగా ఉంది. అలాగే, ఇటీవల విడుదలైన ‘మజిలీ’లో ‘నా గుండెల్లో’, ‘118’లో ‘చందమామే’, ‘అంతరిక్షం’లో ‘సమయమే’ పాటలు పాడాను. గాయకుడిగా నా ప్రయాణం బావుంది. త్వరలో ‘మహర్షి’ విడుదలవుతుంది కనుక ఎగ్జయిటెడ్ గా ఉన్నాను.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2XEM1Ss

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...