Skip to main content

“ఉండిపోరాదే” నిర్మాత అంటుంటే గర్వంగా ఉంది-నిర్మాత బెక్కం వేణు గోపాల్

డబ్బుండి కాదు.. ప్యాషన్ ఉండి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బెక్కం
వేణుగోపాల్.. టీవీ ప్రొడక్షన్ మేనేజర్ గా,కెమెరా అసిస్టెంట్ గా కెరీర్
మొదలు పెట్టిన వేణుగోపాల్ ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్ ఫుల్
నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ దగ్డరనుండి ఆయన చేస్తున్న
ప్రయాణం ప్రస్తుతం చాలా ‘‘హుషారు’’గా సాగుతుంది. ఈ యేడాది మూడు సినిమాలు
విడుదల చేయాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్న బెక్కం వేణుగోపాల్ తన పుట్టిన
రోజు( 27.04. 19) సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

హుషారుకి ఎక్కవు టెంన్షన్ పడ్డాను:

ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు, ‘‘హుషారు’’ వేరు అందుకే ఆ సినిమా
రిలీజ్ ముందు ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఇలాంటి సినిమా చేసాడేంటి అంటారనేది
నన్ను ఎక్కువ ఒత్తిడికి గురిచేసింది.అలాంటిది శుక్రవారం సినిమా రిలీజ్
అయితే ఆదివారంకు థియేటర్స్ అన్నీ ‘‘హుషారు’’తో నిండిపోయాయి.డబ్బులు
వచ్చే సినిమా ఇచ్చావని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ అంటుంటే చాలా
గర్వ పడ్డాను. ‘‘హుషారు’’ సక్సెస్ నాకు కొ్ండంత ధైర్యాన్నిచ్చింది.
కొత్త వాళ్ళతో సినిమా తీసి హిట్ కొడితే ఆ కిక్ ఎక్కువుగా ఉంటుంది.

నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అదే:

నేను చేసే సినిమాలు ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనే ప్రశ్న నేను ప్రతి
సందర్భంలోనూ వేసుకుంటాను. అందుకే నా డబ్బులు తిరిగి రావాలంటే ఖచ్చితంగా
సినిమా బాగుండాలి అనే పాయింట్ తోనే వర్క్ చేస్తాను. ఫొటో షూట్స్, టీజర్స్
మీద ఎక్కువ వర్క్ చేస్తాం. సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా చూడాలని అనే
ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని
సినిమాలు చేస్తాం ఆ భయం నుండే హిట్స్ వస్తాయిని అనుకుంటున్నాను.

అది కేవలం అపోహా మాత్రమే:

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదన్నది అపోహ మాత్రమే, ఆ కొరత కొన్ని
వారాలు మాత్రమే ఉంటుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ చాలా థియేటర్స్ మంచి
సినిమాల కోసం ఎదురు చూసాయి. సినిమా బాగుంటే మన సినిమా అన్ని థియేటర్స్ లో
కనపడుతుంది.

చిన్న సినిమా పెద్ద సినిమాకాదు ఆడే సినిమా చేయాలనుకుంటాను:

నిర్మాతగా చిన్న సినిమా కే నాకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పోతే
మొత్తం పోతుంది. పెద్ద వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాను. కథ దొరికితే
తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాను. కథలను జడ్జ్ చేయడం, రైట్
పర్సన్స్ ని ఆ ప్రాజెక్ట్ కి ఎంచుకోవడం , రిలీజ్ కి ముందే సినిమా మీద
ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం ఈ విషయాలలో నేను ఎక్కువ జాగ్రర్త పడతాను.
యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేయాలంటే కొంచెం భయపడతాను. ఫార్ములాలకు
వ్యతిరేకం కాదు కానీ కొత్తదనం తో ఎక్కువుగా ప్రయత్నించేందుకు ఇష్టపడతాను.

దిల్ రాజు, రామానాయుడు నాకు ఆదర్శం:

నిర్మాతగా రామానాయుడు, దిల్ రాజు గార్లంటే నాకు ఆదర్శం. సినిమా కోసం ఎంత
కష్ట పడవచ్చో వాళ్ల దగ్గరనుండి నేర్చుకుంటాను. అన్ని విభాగాలను హ్యాండిల్
చేస్తూ కథలను జడ్జ్ చేస్తూ వాళ్ల పనితీరు నాకు నచ్చుతుంది. సినిమా మీద
ప్యాషన్ తోనే దిల్ రాజు గారు నేను భాగస్వామ్యులం అయ్యాం. ‘‘నేను లోకల్’’
చేసాం. ఇప్పుడు రాజతరుణ్ హీరోగా ‘‘ఇద్దరి లోకం ఒకటే’’ చేస్తున్నాం.

శివాజీ పోలిటికల్ గా అంత రేంజ్ కి వెళతాడని అనుకోలేదు.

నటుడు శివాజీ,నేను కలిసే ట్రావెల్ చేశాం.మంచి మిత్రులం కూడా..నాకు
ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. పొలిటికల్ గా చాలా నాలెడ్జ్ ఉంది. మాట్లాడే
కెపాసిటీ ఉంది. రాజకీయాల గురించి నాతో మాట్లేడేవాడు కానీ ఇంత రేంజ్ కి
వెళతాడని అనుకోలేదు.

ఈ యేడాది మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నా:

ఈ యేడాది లక్కీ మీడియా బ్యానర్ నుండి కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాం.
మూడు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. సినిమా లో
పూర్తిగా నా ఇన్వాల్ మెంట్ ఉంటుంది. అది కూడా చాలా పాజిటివ్ గా
ఉంటుంది.నక్కిన త్రినాథరావు,పవన్ సాదినేని, హర్ష లాంటి ప్రతిభ కలిగిన
దర్శకులకు నా బ్యానర్ నుండి బ్రేక్ రావడం చాల ఆనందంగా ఉంటుంది.
‘‘హుషారు’’ తర్వాత చాలా యూత్ పుల్ సినిమాలు చేసేందుకు హుషారు వచ్చింది.
ఎక్కడికి వెళ్లినా ఆ సినిమాలోని ‘‘ఉండిపోరాదే’’ సాంగే
వినిపిస్తుంది..నన్ను అందరూ ‘‘ఉండిపోరాదే నిర్మాత’’ అంటుంటే గర్వంగా
ఉంది. అంటూ ముగించారు.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IPjlD9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...