ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించడానికి ఒప్పుకొని తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించింది డైసీ ఎడ్గర్ జోన్స్ . నా కుటుంబ సమస్యల వల్ల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించలేక పోతున్నానని అందుకే ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నానని అయితే నా పాత్రలో ఎవరు నటించిన అద్భుతమైన స్వాగతం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది డైసీ ఎడ్గర్ జోన్స్ .
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎన్టీఆర్ కోసం తీసుకున్న విషయం తెలిసిందే . హైదరాబాద్ లో రెండు షెడ్యూల్ లను పూర్తిచేసుకుంది . మూడో షెడ్యూల్ కోసం పూణే వెళ్లగా అక్కడ రాంచరణ్ కాలికి గాయం కావడంతో షూటింగ్ గ్యాప్ ఇచ్చారు . అయితే ఇప్పుడు డైసీ ఎడ్గర్ జోన్స్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మరో హాలీవుడ్ భామని వెతికే పనిలో పడ్డారు జక్కన్న అండ్ కో .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Uj2gri

Comments
Post a Comment