కేసీఆర్ బయోపిక్ నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ అవుతోంది ఈరోజు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల సమస్య ఎదుర్కొంది. చాలారోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైనప్పటికి పాపం ఎవరూ సహకరించకపోవడంతో కొన్ని నెలలుగా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
అయితే గతనెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేసినప్పటికీ కొన్ని శక్తులు అడ్డుపడటంతో కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం చిత్రం రిలీస్ కాలేదు. ఎన్నో ఆశలతో నిర్మించిన ఉద్యమ సింహం విడుదల సమస్య ఎదుర్కోవడంతో నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు నిర్మాత. ఈరోజు యూట్యూబ్ లో ఉద్యమ సింహం రిలీజ్ కానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YWx7Zo

Comments
Post a Comment