Skip to main content

రుణం” ప్రీ రిలీజ్‌, ఆడియో సక్సెస్‌మీట్‌

బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ లో ..

ప్రొడ్యూసర్‌ జి. రామకృష్ణారావు మాట్లాడుతూ… ఈ సినిమా ఏప్రిల్‌ 12న విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. డైరెక్టర్‌గారు చాలా టైటిల్స్‌ను వెతికి మరీ ఈ కథకు అనుగుణంగా ఉండే రుణం టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. ఇద్దరి స్నేహితుల ఫ్యామిలీల మధ్య నడిచే కథ. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌గారు ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు. నేను ఎన్నో సినిమాలు చూశాను కాని ప్రొడ్యూస్‌ చెయ్యడం మొదటిసారి. మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. డిఓపి కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

ప్రొడ్యూసర్‌ భీమినేని సురేష్‌ మాట్లాడుతూ… మా చిత్ర యూనిట్‌ అందరికీ నా కృతజ్ఞతలుఅన్నారు. ఏప్రిల్‌ 12న విడుదల కాబోతుంది. మా యూనిట్‌ అందరికీ నేను రుణ పడి ఉన్నాను. వచ్చే నెలలో ఇదే టీమ్ తో మరో చిత్రం స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇదే యూనిట్‌కి మరో ఛాన్స్‌ ఇస్తాం అని అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.వి.మల్లిక్‌ తేజ మాట్లాడుతూ… రుణం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 12న విడుదల కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కొత్తవాడినని కూడా చూడకుండా నన్ను ఆదరించిన దర్శకనిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కథతోపాటు నా జర్నీ సాగింది. ఎప్పుడూ డైరెక్టర్‌తోనే ఉండేవాడిని. చిన్న సినిమా అని చూడకుండా మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్‌ ఎస్‌.గుండ్రెడ్డి మాట్లాడుతూ… నేను గతంలో కన్నడలో ఐదు చిత్రాలు చేశాను. రైటర్‌గా నా కెరీయర్‌ని మొదులుపెట్టి ఎన్నో సీరియల్స్‌ రాశాను. తెలుగు, కన్నడకు చేస్తూ ఉండగా ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. నా సినిమాలో ఎక్కడా అశ్లీలత అనేది ఉండదు. ఎవరికీ సందేశమివ్వాలనే ఉద్దేశంతో చెయ్యలేదు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు బాంధవ్యాలు ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్ధాల మధ్య కొనసాగుతుంది. ఈ చిత్రం చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే చిన్న చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ అన్నీ పోతాయి. సెన్సార్‌ కూడా పూర్తయింది. ఇది చాలా పెద్ద మూవీగా తీసుకొస్తున్నాము. మా ప్రొడ్యూసర్లు ఇద్దరు మమ్మల్ని చాలా బాగా చూశారు. హీరోగా చేసిన గోపికృష్ణ కన్నడలో చేశారు. ఇప్పుడు తెలుగు కి వచ్చారు. మీరందరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో మహేంద్ర మాట్లాడుతూ… ఏప్రిల్‌12న మీ ముందుకు రాబోతుంది. డైరెక్టర్‌గారు ఆయన నిజ జీవితంలో జరిగిన కథను ఆధారంగా తీసుకుని చేశారు. కాని ఇది కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది. మనం చేసే పనుల వల్ల మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. అందరూ ఆదరించాని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో గోపికృష్ణ మాట్లాడుతూ… ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని రకాల హంగులతో ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే రియల్‌ స్టోరీ ఇది. ఏప్రిల్‌ 12న విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలి. ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది అన్నారు.

హీరోయిన్‌ ప్రియా మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా మంచివారు. ఇది కేవలం మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రంమే కాదు ఎక్కడా అశ్లీ లత అనేదే ఉండదు. మేము ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టాలు పడ్డాము. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. దయచేసి రివ్యూస్‌ చూసి సినిమాని జడ్జ్‌ చేయవద్దు. అదే విధంగా 11న అందరూ వెళ్ళి తమ ఓట్‌ హక్కును వినియోగించుకోండి అని అన్నారు.

విలన్‌ ప్రదీప్‌ పత్తికొండ మాట్లాడుతూ… ఈ సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరు ఎవరికి రుణపడి ఉంటారు అన్నది కథ. మ్యూజిక్‌ చాలా బాగా కుదిరింది. మా డైరెక్టర్‌గారికి సినిమా అంటే పిచ్చి, మా ప్రొడ్యూసర్‌గారికి ప్యాషన్‌ ఇవి రెండూ కలిస్తేనే ఈ సినిమా. ఏప్రిల్‌ 12న విడుదకాబోతుంది మీరందరూ తప్పకుండా ఆదరించాలి అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ఆర్టిస్టు నారాయణ, మహేష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G6KTRI

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...