Skip to main content

సికింద్రాబాద్ లో నమో అగైన్ టీం భారీ ప్రచారం

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘నమో ఎగైన్’ అవగాహన కార్యక్రమం
మోదీ రెండో సారి ప్రధాని కావాలని నమో ఎగైన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్నికల వేళ జనంలో అవగాహన కల్పిస్తోంది. సికింద్రాబాద్ నియోజక వర్గంలో కిషన్ రెడ్డి ఎంపీ కావాలంటూ స్థానిక శ్రీనగ్ కాలనీ, అమీర్ పేట్, జూబ్లీ హిల్స్ లో 100 మందికి పైగా వాలంటీర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గడిచిన ఐదేళ్లో మోదీ దేశానికి చేసిన సేవలను వాళ్లంతా ఇంటింటికీ చేరి వివరిస్తున్నారు.
“మోదీ మరోసారి ప్రధాని అయితే దేశ రూపురేఖలు మారిపోతాయి. మన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి లాంట వ్యక్తి ఎంపీ అయితే క్యాబినేట్ లో మనకు సముచిత స్థానం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం,” అరుల్ రాజ్.
నమో ఎగైన్ 2019 వ్యవస్థాపకుల్లో అరుల్ రాజ్ ఒకరు. దీంతో పాటు యువకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే మరో ఐదేళ్లు మోదీ ప్రధాని కావాలని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది.
“ఏడాది క్రితమే మేమీ క్యాంపైన్ మొదలు పెట్టాం. ఇప్పుడు ఎన్నికలు రావడంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాం. మోదీ లాంటి నాయకులు దశాబ్దాల కాలంటో ఒక్కసారి వస్తుంటారు. వారి పాలన ఎక్కువ కాలం కొనసాగితే దేశానికి మంచి జరుగుతుంది,” GKS RAJA
నమో ఎగైన్ స్వచ్ఛంద సంస్థకు మరో వ్యవస్థాపకునిగా ఉన్న GKS Raja తమ క్యాంపైన్ గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది యువకులు మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం సంతోషంగా ఉందని అన్నారాయన.
దీంతో పాటు స్థానికంగా ఓటర్లను కలసి వారికి నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయితే ఏఏ అంశాల్లో భారత దేశం ప్రగతి పదంలో దూసుకు పోతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.
“దేశ ప్రయోజనాలే ప్రధానంగా జరుగుతున్న ఈ అవగాహనకు అనూహ్య స్పందన వస్తోంది. మేం ఇళ్లకు వెళ్లి చెప్పే లోపే జనం మాకు చెబుతుందటం ఎంతో సంతోషంగా ఉంది,” అశోక్ పట్నాయక్.
నమో ఎగైన్ క్యాంపైన్ కు కన్వీనర్ గా వ్యవవహరిస్తున్న పట్నాయక్ జనంలో మోదీపై ఉన్న ఫాలోయింగ్ గురించి తెలియజేశారు. మాతో జాయిన్ అవ్వడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నవారితో మాత్రమే కార్యక్రమం చేస్తున్నాం. మోదీ హైదరాబాద్ సభ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తాం. ఎన్నికల లోపు మోదీపై మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఇంటింటికీ వెళ్లి వివరించే కార్యక్రమానికి మాత్రం విశేష స్పందన వస్తోందని నమో ఎగైన్ సభ్యలు వివరించారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KeFvjB

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...