Skip to main content

`చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ మీట్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఈ సినిమా స‌క్సెస్ మీట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ – “ఈ సినిమా స‌క్సెస్ బాగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌ని అంటున్నారు కానీ.. నా దృష్టిలో అది కాదు. సినిమా ప్ర‌జ‌ల‌కు బాగా రీచ్ కావ‌డ‌మే. ఎంతో మంది స‌క్సెస్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. అదే బిగ్గెస్ట్ స‌క్సెస్ అనుకుంట‌న్నాను. ఇది నా ఒక్క‌డి స‌క్సెస్ కాదు. నా టీంతో పాటు ఈ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ స‌క్సెస్ చెందుతుంది. ఈ క‌ల‌ల కోసం ఫైట్ చేయండి. ఇది జ‌ర‌గ‌దు అని ఎంత చెప్పినా విన‌కండి. మీపై మీరు న‌మ్మ‌కం ఉంచండి. పోరాడండి.. క‌చ్చితంగా స‌క్సెస్ ద‌క్కుతుంది. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వీన్‌గారికి, ర‌విగారికి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. కిషోర్‌కి థాంక్స్‌. నా స్నేహితుడే. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్‌ల‌కు థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్‌గారు బ్యూటీఫుల్ ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నా గ్లాస్‌మేట్స్ సునీల్ అన్న‌, హైప‌ర్ ఆది అన్న‌, సుద‌ర్శ‌న్ చాలా కంఫ‌ర్ట్ ఇచ్చారు. నాకు పోసానిగారంటే చాలా ఇష్టం. ల‌వ్‌లీ ప‌ర్స‌న్‌. ఆయ‌న క్యారెక్ట‌ర్‌లో నేను మా అమ్మ‌ను చూసుకున్నాను. మెగాఫ్యాన్స్ అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “ సినిమాలో తేజుని చూసిన‌ప్పుడు ప‌ర్స‌న‌ల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. త‌న ఫ‌స్ట్ సినిమా కంప్లీట్ కాలేదు. డిస్ట్ర‌బ్‌గా ఉన్న‌ప్పుడు కేరింత సినిమా చేద్దామ‌ని తేజుని పిలిచాను. అప్పుడు త‌న ఫేస్‌లో క‌న‌ప‌డ్డ హ్యాపీనెస్‌. ఈ సినిమా క్లైమాక్స్ త‌ర్వాత త‌న ఫేస్‌లో క‌న‌ప‌డింది. స‌క్సెస్ అనేది వ‌స్తే ఎలా ఉంటామో మాకే తెలుసు. మా తేజుకి మంచి స‌క్సెస్ రావ‌డం చాలా హ్య‌పీగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొన‌సాగించాలి. ఫెయిల్యూర్ త‌న ద‌రిదాపుల్లోకి కూడా రాకూడ‌దని కోరుకుంటున్నాను. ఇక డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల సింపుల్ క్యారెక్ట‌ర్స్‌ను తీసుకుంటూ దాన్ని హీరోల‌కు అడాప్ట్ చేస్తూ సింపుల్‌గా సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. అయితే త‌న స్టామినాకు సరైన స‌క్సెస్ రాలేద‌ని భావిస్తున్నాను. మైత్రీ నిర్మాత‌లు మామూలు అదృష్ట‌వంతులు కారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీకి రాగానే మూడు బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించారు. ఎవ‌రికీ సాధ్యం కాదు. స‌క్సెస్ రావ‌డం వేరు. అలాంటి సినిమాలే కుద‌ర‌డం వేరు. చిన్న స్పీడు బ్రేక‌ర్‌ను దాటి మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టారు. సునీల్ ఆర్టిస్ట్ కాకముందు నుండి నాకు తెలుసు. నువ్వే కావాలితో త‌ను స్టార్ అయిపోయాడు. హీరోగా ట్రై చేశాడు. నేను కూడా ట్రై చేశాను. వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌ళ్లీ ఇప్పుడు స‌క్సెస్ బాట‌లోకి వ‌చ్చాడు. యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌.. కంగ్రాట్స్‌“ అన్నారు.
పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాట్లాడుతూ – “విజ‌యోత్స‌వ స‌భ‌లో అంద‌రినీ చూడ‌టం ఆనందంగా ఉంది. ఇందులో గ్లాస్‌మేట్స్‌.., ప్ర‌య‌త్న‌మే మొద‌టి విజ‌యం అనే పాట‌ల‌ను రాశాను. ఈ రెండు పాట‌లు నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 35 స్ఫూర్తి పాట‌ల‌ను రాశాను. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను“ అన్నారు.
పోసాని కృష్ణ‌ముర‌ళి మాట్లాడుతూ – “మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి, ద‌ర్శ‌కుడు కిషోర్‌కి.. సాయితేజ్‌కి అభినంద‌న‌లు. నాకు చాలా మంచి పాత్ర‌ను ఇచ్చారు. నాలాంటి పాత్ర‌లు మ‌న‌కు ఎక్క‌డైనా క‌న‌ప‌డుతుంటుంది. ఈ సినిమాలో నాన్న‌లా.. నా జీవితంలో మా నాన్న‌, మా కొడుక్కి నేను ఉంటుంటాం. ఇంత ఐడెంటిక‌ల్ పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ – “నాకు మంచి పాత్ర ఇచ్చి ఆద‌రించారు. స‌రైన టైంలో మంచి పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు కిషోర్‌కి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.
ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ – “సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌“ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IKGq99

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...