Skip to main content

ప్రారంభైన దిలీప్‌కుమార్ సల్వాది “చిత్రసేన”

ఎస్‌ఆర్‌ఎస్ అసోసియేట్స్, మీటీవీ సమర్పిస్తున్న చిత్రం చిత్రసేన. నర్సింహరాజు రాచూరి, అజయ్ మైసూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దిలీప్ కుమార్ సల్వాది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అజయ్‌మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరాస్వచాన్ చేయగా, లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ… ఈ చిత్రం ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రమిది. పీరియాడిక్ చిత్రాలకు పెద్దపీట పీట వేస్తున్న తరుణంలో పీరియడిక్ చిత్రంగా వస్తుంది. అంతకు ముందు దిక్చూచి చిత్రం తీసిన దర్శకుడు దిలీప్ సల్వాది దీంట్లో హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.
అజయ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ… నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. అక్కడ నాకు ఒక టీవీ ఛానల్ ఉంది. మీ టీవీ అనే ఛానల్. దిలీప్ నటించిన దిక్సూచి చిత్రం చూశాను నాకు నచ్చింది. ఆయన చెప్పిన కథ నచ్చి ప్రొడ్యూస్ చెయ్యడానికి ఒప్పుకున్నాను. దిలీప్, రాజు మళ్ళీ కాంబినేషన్ బావుంటుంది. గతంలో వీరిరువి కాంబినేషన్‌లో చేసిన దిక్సూచి కూడా విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో మీ ముందుకు వస్తారు.
ప్రొడ్యూసర్ నర్సింహరాజు మాట్లాడుతూ… నేను ఈ చిత్రాని కంటే ముందు దిక్సూచి చిత్రం ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాకి కూడా దిక్సూచి డైరెక్టర్ దిలీప్ కుమార్ సల్వాది హీరోగా నటించి దర్శకత్వం వహించారు. కథను నమ్మి సినిమా చేస్తున్నాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో వస్తుంది అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ… నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఆదే ప్రొడ్యూసర్‌తో కలిసి చెయ్యడం అనేది సంతోషమైన విషయం. అంతే కాక మరో ప్రొడ్యూసర్ అజయ్‌గారు కూడా యాడ్ అయ్యారు. కథ విని నచ్చి వీరిరువురూ ఓకే చేశారు. చిత్ర సేన అంటే ఈ సినిమాలో చిత్ర సేన ఎవరు అన్నది మెయిన్ సస్పెన్స్‌గా నడుస్తుంది. సెకండాఫ్ మొత్తం పీరియాడిక్‌గా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. హీరోయిన్ కోసం వెతుకుతున్నాము. ఇది పీరియాడిక్ స్టోరీ కావడంతో మంచి అమ్మాయి కోసం చూస్తున్నాము. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల చేయాలని అనుకుంటున్నాము. ఏప్రిల్ మూడవ వారంలో దిక్సూచి విడుదల చేస్తాము అని అన్నారు.

టెక్నీషియన్స్
ప్రొడక్షన్ కంట్రోల్ డిజైన్‌ఃరామ్‌లక్ష్మీ సల్వాది, వెంకటేశ్వరరావ్ సల్వాది, ఆర్ట్‌ఃపూనూరి ఆనంద్, విఎఫ్‌ఎక్స్‌ఃదిక్సూచి స్టూడియో
స్ రాబిన్‌సన్,లైన్ ప్రొడ్యూసర్‌ః సైపుమురళి, పిఆర్‌ఓః సాయిసతీష్, ప్రొడ్యూసర్స్‌ః నర్సింహరాజు రాచూరి, అజయ్ మైసూరి, కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వంఃదిలీప్ కుమార్ సల్వాది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2uRSgpQ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...