నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 65 కోట్ల షేర్ ని సాధించాడు మహేష్ బాబు . మే 9 న విడుదలైన మహర్షి చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా ఎక్కడా లోటు లేకుండా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. మహేష్ బాబు కున్న స్టార్ డం తో పాటుగా బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేని కారణంగా మహర్షి అవలీలగా 100 కోట్ల క్లబ్ లో చేరింది .
ఓవర్ సీస్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం భారీ వసూళ్లు సాధిస్తున్నాడు మహేష్ . తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 48 కోట్ల షేర్ వసూల్ చేసాడు మహేష్ బాబు . ఈనెల 24 వరకు మహేష్ కు సరైన పోటీ కూడా లేదు కాబట్టి ఈలోపు మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Vz1kiZ

Comments
Post a Comment