Skip to main content

ఎన్ జి కె ప్రేక్షకులకు ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది – హీరో సూర్య

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్‌.జి.కె‘. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జె.ఆర్.సి ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌కి అందించారు. ఈ సందర్భంగా…

నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”హీరో తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. శ్రీరాఘవగారు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాధామోహన్‌గారికి ఈ సినిమా మరో పెద్ద సక్సెస్‌గా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ శివకుమార్‌ విజయన్‌ మాట్లాడుతూ – ”ఈసినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. ఇదొక లాంగ్‌ జర్నీ. సూర్యగారు, శ్రీరాఘవగారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె సినిమా అనువాదంలా అనిపించడం లేదు. తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తే ఎలా వెయిట్‌ చేస్తుంటారో..సూర్యగారి సినిమా కోసం అలాగే వెయిట్‌ చేస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటన్నాం. రాధామోహన్‌గారి ప్రొడక్షన్‌లో సినిమా అంటే మా సొంత సినిమాలాగానే భావిస్తాం” అన్నారు.

నిర్మాత బాపినీడు మాట్లాడుతూ – ”సూర్య, సాయిపల్లవి, రకుల్‌, శ్రీరాఘవగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ – ”హైదరాబాద్‌కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్‌ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచి సూర్య సార్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది. నాకొక మూమెంట్‌. ఆయన సెట్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు షూటింగ్‌ సమయంలో ఎంతగానో సపోర్ట్‌ అందించారు. శ్రీరాఘవగారు ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపిస్తారు. ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నాకు సపోర్ట్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ – ” శ్రీ రాఘవ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నేను స్కూల్‌ అయిపోయిన తర్వాత కన్నడలో ఓ సినిమా చేశాను. అదే 7/జి బృందావన కాలనీ రీమేక్‌. అప్పటి నుండి
శ్రీ రాఘవ సార్‌తో పనిచేయాలని ఉంది. ఈసినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌ ఇది. సీరియస్‌ రోల్‌ చేశాను. సినిమా కోసం ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. సూర్యగారు అమేజింగ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌. ఆయనతో పనిచేయడం హ్యాపీ. ఈ సినిమాకు యువన్‌శంకర్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. మే 31న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ”ట్రైలర్‌ అద్భుతంగా ఉంది కదా!. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది. సూర్యగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

శ్రీరాఘవ మాట్లాడుతూ – ”నేను సూర్యగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందరికీ సూర్యగారు గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంత కంటే గొప్ప మనసున్న మనిషి. ఆయనకు సెల్యూట్‌. ఆయన ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ ఇద్దరూ మంచి నటీమణులు. యువన్‌శంకర్‌ రాజా సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”’ఎన్‌.జి.కె’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభుగారికి థాంక్స్‌. ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్‌. ఇంతకు ముందు పెద్ద హిట్స్‌ సాధించిన సూర్య సినిమాలకు ధీటుగా ఉంటుందని భావిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ – ”ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు థాంక్స్‌. వారి ఆదరణతో దీన్ని నా సొంత ఇంటిలా భావిస్తాను. నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఈ సినిమా మా అందరికీ స్పెషల్‌ మూవీ. నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. రకుల్‌, సాయిపల్లవికి థాంక్స్‌. మే 31న ప్రేక్షకులన అంచనాలను అందుకుంటామని భావిస్తున్నాను. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా” అన్నారు.

చిత్ర దర్శకుడు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KbtE42

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...