Skip to main content

ఎస్.కె. పిక్చర్స్ ద్వారా అంజలి ‘లీసా’ త్రీడి తెలుగు చిత్రం ఈ నెల 24న విడుదల

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న యువ కథానాయకి అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రమే “లీసా’ త్రీడి. వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ తమ అనుభవాలు పంచుకున్నారు. ముందుగా చిత్ర సమర్పకులు కాసాని వీరేశ్ మాట్లాడుతూ ” అంజలి ఇంతకు ముందు ఎన్నో మంచి చిత్రాలు చేయడం జరిగిందని మరో మంచి సినిమాగా ఈ సినిమా వస్తుంది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉంటుంది” అన్నారు . చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ”గతంలో అంజలితో షాపింగ్ మాల్ జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్.కె. పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా త్రీడి సినిమాని కూడా ఆదరిస్తారు. తెలుగులో పూర్తిగా షూటింగ్ జరిగిన ఈ సినిమాని డిజిటల్ రూపంలో త్రీడీలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రమిది. త్రీడీ రూపంలో చూడబోయే ఈ సినిమాని సమ్మర్ కానుకగా పిల్లలు దగ్గరనుండి పెద్ద వాళ్ళందరికీ పూర్తి వినోదాత్మకంగా అందించడం కోసం ఈ వేసవి కానుకగా మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.
“లీసా’ త్రీడీ చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ…
100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది. షూటింగ్ సెట్ లో ఎన్నో మంచి అనుభూతులు పొందాను.
ఒక సినిమా షూటింగ్ చెయ్యడం అంటే కష్టమైన పని అని చెప్పాల్సిన అవసరం లేదు. అది 3D లో అయితే ఇంకా కష్టమైన పని . కానీ పి.జి.ముత్తయ్య గారి ఫ్రేమ్స్ మరియు ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయ్యింది. ముత్తయ్య గారి టైం, కష్టం మా కోసం వెచ్చించినందుకు ఆయనకు నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను.
అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ రోల్ లో ఆమె ఆ పాత్ర కి న్యాయం చేసిందనే చెప్పాలి. నటుడు
సామ్ జోన్స్ ఇందులో మంచి పాత్ర చేసాడు. చాలా మంచి నటుడు. ఇక మకరంద్ దేశ్ పండే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వావ్. ఇతని ఆక్టింగ్ స్కిల్ల్స్ చూసి సెట్ లో అందరు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో
బ్రహ్మానందం గారు నటించారు. ఆయనకు పద్మశ్రీ, గిన్నీస్ రికార్డు వంటి ఎన్నో అవార్డులు ఉన్నా ఎప్పుడూ సింపుల్ గా నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ చెయ్యడం నా
అదృష్టంగా బావిస్తున్నాను. నటి
సలీమా గారు రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడ లో హీరోయిన్ గా చేసింది. నేను తనను అప్రోచ్ అయ్యి ఈ చిత్రంలో నటించమని అడగగానే వెంటనే ఒప్పుకుంది అందుకు ఆవిడకు నా థ్యాంక్స్. ఇక
మైమ్ గోపికు ఐ లవ్ యు. ఇంతకంటే ఎక్కువ ఆయన గురుంచి చెప్పలేను.
సబితా రాయ్, సురేఖ వాణి, చాలా మంచి యాక్టర్స్. చాలాబాగా సపోర్ట్ చేశారు. ఇందులో
కళ్యాణి నటరాజన్ అంజలి కి తల్లి పాత్రలో చేసింది. తన న్యాచురల్ యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. జబర్దస్త్ ఫణి, అవినాష్. జి ఎం ఆర్ కామెడీ పాత్రల్లో నటించారు. వారందరికీ చాలా థ్యాంక్స్ అన్నారు. ఇందులో అంజలి గారి నటన అద్భుతం అని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగొచ్చింది. స్క్రిప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ రాజు అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికీ మా లీసా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అతి త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను కూడా ఈ నెల 24న విడుదల చేస్తామని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడుతూ… ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కలిపించినందుకు దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన ఆర్ ఆర్ తో పాటు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ… మొదటి సారిగా 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజు కు స్క్రిప్ట్ పై మంచి క్లారిటీ ఉంది.. ఏదైతే చెప్పాడో అదే తీసాడు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడ కుండా తీశారు. సంతోష్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తాయి” అన్నారు.

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి’
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,
కోరియోగ్రఫీ: సురేష్,
ఆర్ట్ డైరెక్టర్: వినోద్,
ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2PULSb1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...