Skip to main content

మే 27 నుంచి రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ “డిస్కోరాజా” రెండో షెడ్యూల్

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా“‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయిందా అనే అనుమానాలతో కొన్ని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తళ్లూరి, ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ ఖండించారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ తో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి, రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ త ళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే డిస్కోరాజా షూటింగ్ పై వస్తున్న వార్తల పై నిర్మాత చెక్ పెడుతూ స్పందించారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ డిస్కోరాజా మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫస్ట్ షెడ్యూల్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నాం. ఔట్ ఫుట్ చాలా చాలా బాగా వచ్చింది. రెండో షెడ్యూల్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇంతలొనే… ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు చూసాం. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా సినిమా రూపొందుతున్న నేప‌థ్యంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో కూడిన స‌న్నివేశాలు కీల‌కం, దీని కోసం ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్, చిత్ర యూనిట్ ప‌క్కా ప్లానింగ్ తో త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. అందుకోస‌మే మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగానే రెండో షెడ్యూల్ కోసం ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. రెండో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలోనే సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కు హైద‌రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ కీలక షెడ్యూల్ లో ర‌వితేజ‌గారితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంటుంది. ఇక ఇందులో పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లు అలానే సునీల్, రామ్ కి, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డిస్కో రాజా టైటిల్ కి తగ్గట్టే ర‌వితేజ‌గారి అభిమానుల‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుందని అన్నారు.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీ



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DNTiI8

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...