Skip to main content

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ” 86 వసంతాల తెలుగు సినిమా ” పుస్తకం 1932 నుండి 2018 వరకు తెలుగు సినిమా ఎన్‌ సైక్లోపీడియా 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ మహోత్సవం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ఈ రోజు మే 15 (బుధవారం) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపి మురళీమోహన్‌, మా అధ్యక్షులు నరేష్‌ వి కె, ప్రముఖ సినీ రచయిత డా. పరుచూరి గోపాల కృష్ణ, సినీ విజ్ఞానవిశారద ఎస్‌ వి రామారావు, ప్రముఖ సినీ నటులు, రచయిత రావి కొండలరావు, డా. కే వి రమణ చారి పాల్గొన్నారు. ముఖ్య అతిధులను ఫాస్‌ అధ్యక్షుడు కె ధర్మారావు శాలువాలతో సత్కరించారు.. ఈ సందర్భంగా

సినీ విజ్ఞాన విశారద ఎస్‌ వి రామారావు మాట్లాడుతూ – ”ఒక రకంగా ”86 వసంతాల తెలుగు సినిమా” పుస్తకం తెలుగు ప్రేక్షకులకు పెద్ద బాలశిక్ష అనుకోవాలి, నూతనంగా సినిమాలు నిర్మించాలనుకునే దర్శక నిర్మాతలకు కావాల్సిన అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగులో దాదాపు 50 మంది రచయితలు 200 పుస్తకాలకు పైగా రాశారు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంభందించి ఇన్ఫర్మేషన్‌ ఓరియెంటెడ్‌ బుక్‌ ఇది. ఇంత డీటైల్డ్‌గా మరే పుస్తకం లేదు” అన్నారు
టిఎఫ్‌ డి సి చైర్మన్‌ పి. రామ్‌ మోహన రావు మాట్లాడుతూ – ”ధర్మారావు గారి పుస్తకం ఒక ఎన్‌ సైక్లోపీడియా. సినిమా రంగం మీద ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రతి ఒక్కరూఈ పుస్తకాన్ని రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. అంత అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా టి ఎస్‌ఎఫ్‌ డి సి తరపున కావాల్సిన సహాయం అందిస్తామని సభాముఖంగా తెలీయజేస్తున్నాను” అన్నారు.

మాజీ ఎంపి మురళిమోహన్‌ మాట్లాడుతూ – ”ధర్మారావు గారు నాకు చాలా కాలంగా తెలుసు. మంచి ఆలోచన 1932 నుండి సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులను చాలా విశ్లేషంగా తెలియజేసారు. ఇందులో నా పాత్ర కూడా వుంటుందనే ఆశిస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని మా సభ్యులకు బహుకరించడం అనేది చాలా గొప్ప ఆలోచన. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో తన పేరు నిలుస్తుంది. 86 వసంతాల తెలుగు సినిమా చరిత్రను రాసిన ధర్మారావు గారిని అభినందిస్తూ ఆయన ప్రస్థానం 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మా అధ్యక్షుడు నరేష్‌ వి కె మాట్లాడుతూ – ”చరిత్రలో నిలిచిపోయే పుస్తకాన్ని రచించిన ధర్మారావు గారికి మా తరపున ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని మా సభ్యులందరి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తాము. ఇలాంటిపుస్తకాలకు మరింత ప్రజాదరణ అవసరం. మా సంగం తరపున ఈ పుస్తకానికి తగిన సాయం చేస్తాను అలాగే ఇక్కడికి వచ్చిన అతిరధమహానుభావులందరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.

ప్రముఖ రైటర్‌ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ”నన్ను ఇక్కడికి అతిధిగా పిలిస్తే వచ్చాను. ధర్మారావు గారు అందరికి పుస్తకం ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు బహుశా నేనే ఒక పుస్తకం అనుకోని ఉండవచ్చు. చాలా గొప్ప ప్రయత్నం. చాలా ఓపిక కావలి, అలానే పూర్తి వివరాలు సేకరించాలి. అలా అన్ని వివరాలు ఎంతో ఓపికతో సేకరించి ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకి అందిస్తున్న ధర్మారావు గారికి నిజంగా నా ధన్యవాదాలు. ఆయన ఇలాంటిపుస్తకాలు మరెన్నో అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో లయన్‌ ఏ విజయ్‌ కుమార్‌, శిరోమణి వంశి రామరాజు, సీనియర్‌ నటి గీతాంజలి, కృష్ణవేణి, నిర్మాత బి ఏ రాజు, నిర్మాత సురేష్‌ కొండేటి, సీనియర్‌ పాత్రికేయులు ప్రభు తదితరులు పాల్గొన్నారు….

 

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2w041uJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...