Skip to main content

ఈ వేస‌విలో ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ `ABCD` – అల్లు శిరీష్‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుద‌లైంది. సినిమా స‌క్సెస్‌ను యూనిట్ సెల‌బ్రేట్ చేసుకున్నారు. కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన స‌క్సెస్ ప్రెస్ మీట్‌లో…

మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ – “నేడు సినిమా విడుద‌లైంది. మార్నింగ్ షోతోనే బ‌ల‌మైన ఓపెనింగ్స్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈవెనింగ్ షోతో త‌ర్వాతనే సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకున్నాం. ఏదైతే ముందుగా మేం క‌థ‌ను అనుకున్నామో, తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్‌ని క‌రెక్ట్‌గా సెట్ చేయాలి. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చేలా తీయాలని అనుకున్నామో. అది ఈరోజు నేర‌వేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌గా న‌టించాడు. మా బ్యాన‌ర్‌లో చేసిన `ఏబీసీడీ`ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేశాం. అల్లు శిరీష్, కొత్త స్టార్‌గా మారాడని అంద‌రూ అంటున్నారు. త‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. త‌నలో హ్యాపీనెస్ చూడాల‌నుకున్నాను. అది ఈరోజు నేర‌వేరింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ స్టోరీ, భ‌ర‌త్, వెన్నెల‌కిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయ‌ని అంటున్నారు. అమెరికాలో పుట్టిన ఓ యువ‌కుడు ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న విధానాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా చేశార‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. 68%తో ఓపెనింగ్ అయిన ఈ సినిమా, 74% మ్యాట్నీకి పెరిగింది. సాయంత్రానికి అది 78% పెరిగింది. ఓ నిర్మాత‌గా చాలా సంతోషంగా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీని `శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు` సినిమాను ఈ వీకెండ్‌లో దాటాల‌ని కోరుకుంటున్నాను. దాటుతామ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. త్వ‌ర‌లోనే పెద్ద స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హంచ‌బోతున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – “ మేం ఎక్క‌డ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని అనుకున్నామో, దానికి ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి యూనానిమ‌స్ యాక్టింగ్ చేశారు. ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డిగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌“ అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ – “ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. కొత్త జంట‌, శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమాల‌కు బెట‌ర్‌గా ఓపెన్ అయ్యింది. ప‌ర్స‌న‌ల్‌గా ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ క‌లుగుగుతుంది. ఈరోల్‌లో చేస్తున్న‌ప్పుడు క‌నెక్ట్ అయ్యి బాగాఎంజాయ్ చేస్తూ చేశాను. ప్ర‌తి షోకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌స్తున్నాయి. మ‌ధురగారు కోరుకున్న‌ట్లు శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమా క‌లెక్ష‌న్స్‌ను దాటాల‌ని కోరుకుంటున్నాను. నాకు మంచి సినిమా ఇచ్చిన మ‌ధుర శ్రీధ‌ర్‌గారికి, మంచి థియేట‌ర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుగారికి థాంక్స్‌. సంజీవ్ న‌న్ను చూడ‌ని విధంగా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అంద‌రూ బాగున్నాన‌ని, బాగా చేశావ‌ని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం సంజీవ్‌కే ద‌క్కుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఏ సినిమాకు రాలేదు. సంజీవ్‌, రామ్‌తోట‌ల‌కు థాంక్స్‌. ఈ స‌మ్మ‌ర్‌లో ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ ఇది“ అన్నారు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YCtlDn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...