Skip to main content

AISFM గ్రాడ్ ఫెస్టివల్ లో స్క్రిప్ట్ రైటింగ్ మేజర్ బ్యాచిలర్స్ / మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్

బాహుబలి భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి స్క్రిప్ట్ ని అందించిన స్టార్ స్క్రిప్టురైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు AISFM లో స్పెషలైజ్డ్ క్రియేటివ్ బ్యాచిలర్స్ , మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ” కథల్ని ఆకట్టుకునేలా చెప్పాలి. ఒక ఆలోచనగా మొదలైన దాని చుట్టూ కథని నిర్మించాలి. అలా సిద్ధమైన ఆ కథ ఆత్మ ని అర్ధం చేసుకుని ప్రాణం పోయడమే ఫిలిం మేకింగ్. మన పరిసరాల్ని ఎంత సూక్ష్మంగా గమనిస్తామో అంత పవర్ఫుల్ కథని చెప్పగల నేర్పు సాధిస్తాం. ఫిలిం గ్రాడ్యుయేషన్ ఈ ప్రయాణానికి నాంది పలుకుతుంది.”

రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైంది. ఇందులో గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిర్మించిన 8 విభిన్నమైన, ఆలోచన రేకెత్తించే చిత్రాలని ప్రదర్శిస్తున్నారు.

రశ్మిత్ కౌర్ నిర్మించిన ‘ఇనాం’, ఆకాష్ చంద్రశేఖర్ మెల్లిగేరి నిర్మించిన ‘సందిగ్ధ’, సోమప్రియా బోస్ నిర్మించిన ‘కటకః – To Revive An Old వరల్డ్’, పుర్వాంగీ రాజన్ నిర్మించిన ‘చుప్పి’, ఉత్కర్ష బలరాం నిర్మించిన ‘నాన్ దెవృ’, ఎస్ వెంకట నారాయణ మూర్తి నిర్మించిన ‘ఫలక్‘, సుస్మిత కాళంగి నిర్మించిన ‘అంతర్గత’, సిద్ధి యాదవ్ నిర్మించిన ‘Trivial Pursuit’… ఈ 8 చిత్రాల ప్రీమియర్ లని ప్రదర్శిస్తున్నారు.

AISFM గ్రాడ్ ఫెస్టివల్ 2019 లో భాగంగా జరిగిన ఈ చిత్రాల ప్రీమియర్ కి తెలుగు సినీపరిశ్రమ ప్రతిభావంతులు విజయేంద్ర ప్రసాద్, సుమంత్ యార్లగడ్డ, అడివి శేష్, AISFM డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

AISFM చైర్మన్, కింగ్ అక్కినేని నాగార్జున యంగ్ ఫిలిం మేకర్స్ ని అభినందిస్తూ, ” మీరు సరైన సమయంలో సరైన చోట ఉన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రయోగాలు చేయండి, కొత్తవి అర్ధం చేసుకోండి, కష్టపడండి, ఎదగండి. సినిమాల పట్ల మీకున్న ప్యాషన్, ప్రేమ ని ఇంకా ఇంకా పెంచుకోండి. అల్ ది బెస్ట్” అన్నారు

AISFM స్టూడెంట్స్ లో సృజనాత్మకమైన ఆలోచనల్ని పెంపొందించడం, సినిమా కి సంబంధించి టెక్నికల్ అంశాల గురించి అవగాహన కల్పించడం చేస్తుంది. వారు తమ చిత్రాల్ని నిర్మించడానికి అనువుగా వరల్డ్ క్లాస్ స్టూడియో, పరికరాల ని వారికి AISFM అందుబాటులో ఉంచుతుంది. టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే విభిన్నమైన అంశాల పై విద్యార్థులు తమ అభిప్రాయాలకి అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పిస్తుంది.

AISFM డైరెక్టర్ అమల అక్కినేని స్టూడెంట్స్ ని అభినందిస్తూ, వారి ఉన్నత భవిష్యత్తుని కాంక్షిస్తూ, “మంచి సినిమా అంటే మంచి కథ, యాక్టింగ్, కెమెరా మాత్రమే కాదు. ప్రేక్షకులలో అంతర్మధనం జరిగేలా చేయగలిగేది. చెప్పాలనుకునే విషయం మీద పూర్తి అవగాహనతో అవసరమైనవి అన్ని సమకూర్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. టీం గా పనిచేయడం చాలా అవసరం. ఇక్కడ స్టూడెంట్స్ ఫిలిం మేకింగ్ మాత్రమే కాకుండా ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకోవడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, ఒక టీం గా కలిసి పనిచేయడం నేర్చుకుంటారు.” అన్నారు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2PJXltV

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...