Skip to main content

కె.స్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి

కె.స్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ”తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నటుడు రాజేష్‌ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశర్యారాజేష్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించింది. ఐశ్వరా రాజేష్‌ తమిళ్‌, మలయాళ సినిమాలు చేసినా ఫిమేల్‌ క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది. అలాగే మా వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే క్యారెక్టర్‌ చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జూన్‌ మూడోవారంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రం. ఒక మంచి సబ్జెక్ట్‌తో, ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుంది. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేయడం జరిగింది. ‘శుభాకాంక్షలు’, ‘శుభమస్తు’, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’ వంటి ఫ్యామిలీ పిక్చర్స్‌ చేసిన నాకు దర్శకుడిగా ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ ఎంతో సంతృప్తిని కలిగించింది. ఐశ్వర్యా రాజేష్‌ క్రికెటర్‌గా చేయడానికి ఎంతో డెడికేటెడ్‌గా ఆరు నెలలపాటు క్రికెట్‌ నేర్చుకొని ఈ చిత్రంలో నటించడం విశేషం. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌ ఈ సినిమాకి ప్రాణం. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ కలిగిస్తుంది” అన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2W70iuf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...