Skip to main content

డైరెక్టర్స్ డే తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మెగాస్టార్ చిరంజీవి

దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని డైరెక్టర్స్‌డే పేరుతో గత ఏడాది నుంచి దర్శకుల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా దాసరి జయంతి సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ హీరో చిరంజీవి టిఎఫ్‌డిఏ.ఇన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్ సైట్‌ని ప్రారంభించారు. అనంతరం గత ఏడాది విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న తొలి చిత్ర దర్శకులను సత్కరించి జ్ఞాపికల్పి అందజేశారు. నీది నాది ఒకే కథ చిత్రానికి గాను టి.కృష్ణ పురస్కారాన్ని దర్శకుడు వేణు ఊడుగుల అందుకోగా, కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి గానూ కోడి రామకృష్ణ అవార్డును వెంకటేష్ మహా స్వీకరించారు. ఛలో చిత్రానికి గాను వెంకీ కుడుముల ఇ.వి.వి పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆర్‌ఎక్స్100 చిత్రానికి గానూ అజయ్ భూపతి విజయబాపినీడు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుతో పాటు 25 వేల నూపాయల నగదు బహుమతిని వీరికి చిరంజీవి అందజేశారు. విశ్వదర్శనం చిత్రానికి గానూ జనార్థన మహర్షిని, ఆంగ్ల చిత్రాన్ని తెరకెక్కించినందుకు గానూ వీఎన్ ఆదిత్యలను ఇదే వేదికపై చిరంజీవి సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ దాసరి నారాయణరావు పుట్టిన రోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి వుండదు. ఇది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 24 శాఖలపై మంచి పట్టుతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకులు దాసరి. నాటక రచయితగా, రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. దాసరి లాంటి వ్యక్తి మరొకరు లేరు ఇక రారు. ఆయనతో కలిసి పని చేసింది ఒకే ఒక్క సినిమా లంకేశ్వరుడు. ఆయనతో నాకు అనుబంధం చాలా తక్కువ. రాఘవేంద్రరావుతో అత్యధికంగా చిత్రాలు చేశాను. దాసరితో ఎక్కువ చిత్రాలు ఎందుకు చేయలేకపోయానే అని బాధపడేవాడిని. ఆయన చాలా సందర్భాల్లో నన్ను మనవడిగా సంబోధించారు. అందరికి తెలియని విషయం ఒకటి వుంది. మా ఇద్దరికి చుట్టరికం వుంది. వరుసకు దాసరి, నేను తాతా మనవళ్లం అవుతాం. చివరి రోజుల్లో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఖైదీ నంబర్ 150 వేడుక విజయవాడలో జరిగినప్పుడు ఆయన అతిథిగా వచ్చి ఆశీర్వదించారు. ఓ రోజు పాలకొల్లు నుంచి బొమ్మిడాయిలు తెప్పించానని ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఫోన్ చేసి భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య అవార్డుని ఆయన ఇంటికి వెళ్లి నా చేతులతో అందించి వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా గొప్ప దర్శకులున్నారు. వాళ్లలో దాసరి శైలి ప్రత్యేకం. ఎంత మంది గొప్ప దర్శకులున్నా దాసరిని మించిన దర్శకులు లేరు ఇక రారు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుల సంఘం సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం దర్శకులు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ గతంలో ఓ వెలుగు వెలిగిన దర్శకులు ఇప్పుడు అవకాశాలు రాక, వయసు సహకరించక దయనీయ స్థితిలో వున్నారు. వారి ఆదుకోవడానికి నా తరపున 10 లక్షలు, బాహుబలి నిర్మాతలు ఇచ్చే 15 లక్షలు కలిపి 25 లక్షలు అందించబోతున్నాను. మిగతా సంఘాల సభ్యులకు పెన్షన్‌లు, హెల్త్ కార్డ్‌లు వున్నాయి కానీ దర్శకుల సంఘంలోని సభ్యులకు అలాంటివి లేవు. అందుకే 5 కోట్లతో దర్శకుల సహాయనిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దర్శకుడు రాజమౌళి తన వంతుగా స్పందించి 50 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించారు.ఈ నిధికి విరాళాలు అందించడానికి అగ్ర దర్శకులు చాలా మంది ముందుకొస్తున్నారు. వారే కాకుండా నటీనటులు కూడా వారికి తోచిన మొత్తాన్ని దర్శకులు సంఘం సహాయనిధికి అందజేయాలని కోరుతున్నాం అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ మాట్లాడుతూ స్వర్గీయ దాసరి నారాయణరావు పుట్టిన రోజును డైరెక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనందంగా వుంది. ఇలాంటి సమయంలో అందరం కలిసి మన ఆనందాన్ని పంచుకోవడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైరా చిత్రీకరణ విదేశాల్లో జరుగుతున్నా.. కుటుంబం మొత్తం అక్కడే వున్న చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి దర్శకుల సంఘం కుటుంబం కోసం అన్నయ్య చిరంజీవి ప్రత్యేక విమానంలో సొంత ఖర్చుతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక నుంచి కూడా దర్శకులు సంఘం నిర్వహించబోయే కార్యక్రమాలకు అన్నయ్య చిరంజీవి వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం. దర్శకుల సహాయ నిధికి విరాళాల ద్వారా ఒక్కరోజే కోటి రూపాయాలు సమకూరడం ఆనందంగా వుంది. మిగతా దర్శకులు కూడా సహకరిస్తే త్వరలోనే ఇది 5 కోట్లకు చేరుతుంది. ఈ విషయంపై త్వరలోనే అగ్ర దర్శకులం అంతా ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించుకోనున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రామ్‌ప్రసాద్, దర్శకులు హరీష్‌శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, కాశీవిశ్వనాథ్, ఏ.ఎస్.రవికుమార్, తనికెళ్లభరణి, వి.ఎన్. ఆదిత్య, ఆర్.నారాయణమూర్తి, ఏ.కోదండరామిరెడ్డి, విజయభాస్కర్, శివనాగేశ్వరరావు, బీవీఎస్,రవి, వీరశంకర్‌తో పాటు దర్శకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2PSriIk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...