Skip to main content

‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తమ తొలి చిత్రం గా మిస్ మ్యాచ్ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా సలీం వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు

ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ…’ డైరెక్టర్ నిర్మల్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. మంచి మిత్రుడు . ఆయన మేకింగ్ నాకు డా:సలీం(విజయ్ ఆంటోని) సినిమా తోనే అర్థమైంది . ఈ సినిమా అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుందనే అనుకుంటున్నాను . దీనికి రచయిత భూపతి రాజు గారు, ఆయన గురించి మనందరికీ తెలిసిందే .ఆనాటి ముఠామేస్త్రి  నుండి ఇప్పటి సైరా నర్సింహారెడ్డి వరకు ఆయన రాసిన సినిమా లు మనం చూస్తూనే ఉన్నాం.సినిమాటోగ్రాఫర్  గణేష్ గారు, నిర్మాత శ్రీ రామ్ మరియు భరత్ రామ్ గారు అందరు నాకు తెలిసిన వాళ్ళే. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా కథానాయకుడు ఉదయ్ శంకర్, కథానాయకి ఐశ్వర్య రాజేష్ . ఈయన మొదటి సినిమా ఆట గదరా శివ చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో రూపొందించబడింది, మంచి విలువలు కలిగిన చిత్రం.. ఈ సినిమా కి పని చేస్తున్న నటీ  నటులు, సాంకేతిక నిపుణులు అందరికి శుభాకాంక్షలు అన్నారు.

మాటల రచయిత రాజేంద్రకుమార్ ఇది ఒక అచ్చమైన , స్వచ్చమైన ప్రేమ కథ. ఒక బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, కంచె  లాంటి సినిమాల స్థాయి లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమా రష్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా ఏ స్థాయిలో  ఉంటుందో అని. మీ అందరికి చాల బాగా నచ్చుతుంది. డైరెక్టర్ నిర్మల్ కుమార్  గారు మనకు డా:సలీం సినిమా తోనే పరిచయం అయ్యారు. చాల మంచి దర్శకుడు. ఈ సినిమా ని మీరు అందరు ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర కధా రచయిత భూపతిరాజా మాట్లాడుతూ మా మాటని మన్నించి ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన దర్శకులు క్రిష్ గారికి కృతజ్ఞతలన్నారు

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…’ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసినందుకు క్రిష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే నచ్చి పక్కాగా  చేద్దాం అని చెప్పాను. అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ పరంగా సినిమా బాగా వస్తోంది..అన్నారు

మరో మాటల రచయిత మధు మాట్లాడుతూ…’ భూపతి రాజా గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భూపతి రాజ గారు రాసే కథలు యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటాయి.. కొత్త దనం ఉన్న కథ. దీనికి తోడు మంచి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మంచి కాస్టింగ్ ఈ చిత్రానికి తోడయ్యింది అన్నారు

చిత్ర నిర్మాతలలో ఒకరైన జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ…’ఒక మంచి కథాబలం ఉన్న ఈ చిత్రం మిస్ మ్యాచ్ తో నిర్మాత అవుతున్నందుకు సంతోషంగ ఉందని అన్నారు

మరో నిర్మాత భారత్ రామ్ మాట్లాడుతూ…’. ముందుగా ఒక మాట చెప్పాలి. మా అందరకి గురువు, మేము నమ్మే వ్యక్తి  ‘శ్రీరామ్ సార్ ఆయన  వల్లే మేము ఇక్కడ ఉన్నాం.ఆయన అబ్బాయే మన హీరో ఉదయ్ శంకర్  ఈ సినిమా మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాను అన్నారు

సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ..’ఇంత మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమా కి నేను సాంగ్స్ కంపోజ్  చేయడం నిజంగా నా అద్రుష్టం . ఈ సినిమా వల్ల మంచి టీం దొరికింది. అందరకి నా శుభాకాంక్షలు.

ఛాయాగ్రాహకుడు గణేష్ చంద్ర మాట్లాడుతూ..’ నా తొలి చిత్రానికి ఇంత మంచి టీమ్ దొరకటం సంతోషంగా ఉందని అన్నారు.  

చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ…’క్రిష్  గారు నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కు అవకాశం  ఇచ్చిన నిర్మాతలకు కృతఙ్ఞతలు.నాకు ఇది తెలుగులో ఫస్ట్ మూవీ. దీనికి రచయిత సరస్వతి పుత్రుడు అయినటువంటి భూపతి రాజ గారు కధ నందించారు. సలీం చిత్రాన్ని ఎలా అయితే ఆదరించారో,మిస్ మ్యాచ్ని  కూడా అలానే ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు

 చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం

దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .

నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్ 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YhSMtH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...