Skip to main content

ఎంతవారలైనా’ సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం – నిర్మాత జి.సీతారెడ్డి

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన న్యూ జనరేషన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా‘. ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో మే 17న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి ఇంటర్వ్యూ.
కన్‌స్ట్రక్షన్‌ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మీరు ప్రొడ్యూసర్‌గా మారడానికి రీజన్‌?
– నేను ప్రొడ్యూసర్‌గా మారడానికి మెయిన్‌ రీజన్‌ నా క్లాస్‌మేట్‌, దర్శకుడు గురు చిందేపల్లి. ఆ తర్వాత సినిమాలపై నాకున్న ప్యాషన్‌. సినిమాలంటే చిన్నప్పట్నుంచి పిచ్చి. దొంగతనంగా వెళ్ళి సినిమాలు చూసొచ్చేవాళ్లం. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కన్‌స్ట్రక్షన్‌ రంగంలో బిల్డర్‌గా రాణించి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాను. ఒకసారి మా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ అందరూ గెట్‌ టు గెదర్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడే నా చిన్నప్పటి మిత్రుడు, క్లాస్‌మేట్‌ గురు చిందేపల్లిని కలవడం జరిగింది. తనకి దర్శకత్వ శాఖలో అనుభవం ఉండటంతో నాకు ఈ కథ చెప్పారు. కథ విన్నప్పుడు నేను కూడా చాలా ఎగ్జయిట్‌గా ఫీలయ్యాను. నాకు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ప్యాషన్‌ ఉండటంతో ఈ సినిమాను నేనే నిర్మిస్తాను అని చెప్పాను. దాని వల్ల నా చిరకాల మిత్రుడికి దర్శకుడిగా అవకాశం కల్పించి హెల్ప్‌ చేసినట్లుంటుంది.. నాకు ఇంటర్నల్‌గా ఉన్న ఆకాంక్ష తీరినట్లుంటుంది అని ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గామారాను.
ఎంతవారలైనా‘ మెయిన్‌ కాన్సెప్ట్‌ ఏంటి?
– ఈసృష్టి ప్రారంభం నుండి మంచి చెడు అనేవి రెండు మార్గాలు ఉన్నాయి. దేవతలు, రాక్షసుల కాలంలో అమ తం కోసం తలపడేవారు. తరవాత రాజులకాలంలో రాజ్యాల కోసం, ఆ తర్వాత నిధులు, నిక్షేపాలకోసం యుద్ధాలు జరిగేవి. అయితే ప్రస్తుత కాలంలో ధనం కోసం దాడులు, హత్యలు జరుగు తున్నాయి, అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎంతవారలైనా శిక్షార్హులే.. అనే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
దర్శకుడు గురు చిందేపల్లి గురించి?
గురు చిందేపల్లికి సినిమా రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉంది. నేషనల్‌ అవార్డు విన్నర్‌ నరసింహా నందిగారి దగ్గర దర్శకత్వ శాఖలో కోడైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఆ అనుభవంతో ఈ చిత్రం కథను రెడీ చేశారు. నిర్మాతగా ఇది నాకు మొదటి సినిమా అయినా నా మీద ఎలాంటి ప్రెజర్‌ లేకుండా సినిమాని అనుకున్నది అనుకున్నట్లుగా పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో నాతో ఒక క్యారెక్టర్‌ చేయించడం జరిగింది.
మీ క్యారెక్టర్‌ గురించి చెప్పండి?
– నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఉన్న ఇంట్రెస్ట్‌ని క్యాప్చర్‌ చేసి దర్శకుడు నాతో ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ ఎస్‌.పి. క్యారెక్టర్‌ చేయించారు. ఇది నటుడిగా నాకు మొదటి సినిమా అయినప్పటికీ నిజ జీవితంలో డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ అయిన ఉమేష్‌ చంద్ర, సురేంద్రలాంటి పోలీస్‌ ఆఫీసర్స్‌ స్పిరిట్‌తో.. అలాగే నా అభిమాన నటుడు ఎస్‌.వి రంగారావుగారి స్పూర్తితో ఈ క్యారెక్టర్‌ చేశాను.
మీరు పోషించిన పాత్రను స్క్రీన్‌ మీద చూసుకున్నాక ఎలా అన్పించింది?
– ఎస్‌.పి. క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్‌ నుంచి కూడా మంచి అప్లాజ్‌ వచ్చింది. స్క్రీన్‌ మీద ఎస్‌.పి. క్యారెక్టర్‌లో నన్ను చూసి గతంలో పోలీస్‌ ఆఫీసర్లుగా నటించి, మెప్పించిన రాజశేఖర్‌, సాయికుమార్‌లతో పోల్చడం చాలా సంతోషం కలిగించింది.
నటుడిగా మీకు ఇన్‌స్పిరేషన్‌?
– నాకు నటుడిగా ఎస్‌.వి. రంగారావు, కమల్‌హాసన్‌గార్లను అభిమానిస్తాను.
నిర్మాతగా మారడానికి చాలామంది భయపడుతుంటారు కదా!
– అలాంటిదేం లేదండీ. చాలామంది వ్యాపార రంగం నుండి నిర్మాతలుగా మారి సక్సెస్‌ సాధించారు. అలాగే కళామతల్లిని నమ్ముకుంటే నష్టపోరు అని నిరూపించారు. దానికి డెడికేషన్‌ ఉండాలి.. దానికి ఉదాహరణ దిల్‌ రాజుగారు. దిల్‌ రాజుగారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బిజినెస్‌మేన్‌గా ఆయన డెడికేషన్‌ కానీ, నిర్మాతగా కథల విషయంలో ఆయన జడ్జిమెంట్‌కానీ.. చాలా గొప్పది. నిర్మాతగా నాకు రామానాయుడుగారు, బిజినెస్‌పరంగా నాకు దిల్‌ రాజుగారు ఇన్‌స్పిరేషన్‌. ఆయన్ని నేను ఇంతవరకూ కలవలేదు. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.
ఈ సినిమాలో మిమ్మల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసిన విషయం?
– ‘ఎంతవారలైనా’ సినిమాకి కథే హీరో అని డెఫినెట్‌గా చెప్పగలను. కమల్‌హాసన్‌గారి సినిమాలు చూస్తే.. పెద్ద ప్యాడింగ్‌ ఉన్నా.. కథానుసారం సినిమా ఉండి ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్‌ కాకుండా సినిమాలో నిమగ్నం చేస్తుంది. అలాగే మా సినిమా కూడా కథకి అనుగుణంగా నడుస్తుంది. మంచి, చెడు అనే పాయింట్‌ మీద దర్శకుడు చిందేపల్లి కథను చాలా బాగా చెప్పారు. చాలా బాగా తీశారు కూడా. చనిపోయిన మనిషి చివరిలో పడే వేదనను బాగా చూపించారు. అది ఇప్పుడు రివీల్‌ చేయలేను. మే 17న సినిమా చూసి తెల్సుకోవాల్సిందే. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ఆర్టిస్ట్‌ల కష్టం, దర్శకుడి పనితీరు గురించి మాట్లాడతాను.
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
– ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన మా ‘ఎంతవారలైనా’ చిత్రం ఆడియోకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని జనరేషన్స్‌ వారు మా సాంగ్స్‌ని మెచ్చుకుంటున్నారు. సంగీత దర్శకుడు సుక్కు అదిరిపోయే సంగీతంతో పాటు మంచి రీరికార్డింగ్‌ ఇచ్చారు.
షూటింగ్‌ ఎక్కడెక్కడ చేశారు?
– హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అలాగే నాకు మొదటి సినిమా అయినా నా టీం అందరు నాకెంతగానో సపోర్ట్‌ చేశారు. సాంగ్స్‌ అన్ని ఫారిన్‌ లొకేషన్స్‌లో లాగా చాలా రిచ్‌గా, బ్యూటిఫుల్‌గా కన్పిస్తాయి.
చిత్రంలో నటించిన హీరోహీరోయిన్ల గురించి?
– ఈ చిత్రంలో హీరో అద్వైత్‌. తనకి కన్నడంలో మంచి పెర్‌ఫార్మర్‌గా పేరుంది. అలాగే హీరోయిన్‌ జహీదా తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. అలీషా ఐటెమ్‌ సాంగ్‌తో తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిటీ తెచ్చుకుంది. వారితో పాటు ఇటీవలకాలంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలోక్‌ జైన్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కన్పిస్తారు. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో మీకు హీరోయిన్‌ ఉందా?
– నా క్యారెక్టర్‌ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. నాకు హీరోయిన్‌ లేదు.
ఇతర టెక్నీషియన్స్‌ గురించి చెప్పండి?
– ఈ సినిమా మేం అనుకున్నప్పటి నుండి అన్నీ బాగా కుదిరాయి. ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి బ్యూటిఫుల్‌ ఫొటోగ్రఫీ అందించారు. అతను ఇదివరకే బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు తీసుకున్న విషయం తెలిసిందే. ఎడిటర్‌ వి.నాగిరెడ్డిగారు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు పనిచేశారు. డ్యాన్స్‌, ఫైట్స్‌ కూడా మంచి పేరున్న టెక్నీషియన్స్‌ మా సినిమాకు ప్రాణం పెట్టి వర్క్‌ చేశారు. నా ఫస్ట్‌ మూవీనే సూపర్‌ ప్రోడక్ట్‌లా వచ్చిందని చెప్పాలి.
సినిమాలో హైలైట్స్‌?
– మా సినిమాలో ముఖ్యంగా స్టోరి, సాంగ్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే దర్శకుడు ప్రతి క్యారెక్టర్‌కి ఓ స్పెషల్‌ ఐడెంటిటీ ఇస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.
నిర్మాతగా కొనసాగుతారా! లేక నటుడిగానా?
– నటుడిగా ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు అడుగుతున్నారు. ఈ సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నాం. సినిమా విడుదలయ్యాక మిగతా ప్రాజెక్ట్స్‌ గురించి ఆలోచిస్తాను. నటుడుగా నేను న్యాయం చేయగలిగే పాత్రలు చేయడానికి నేనెప్పుడూ సిద్దమే..
రిలీజ్‌ ఎప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు?
– మా చిత్రం ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మా సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు అభినందించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించాం. తెలుగులో మే 17న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. కన్నడలో కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అంటూ ఇంటర్వూ ముగించారు నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YanCEs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...