Skip to main content

`నా పేరు రాజా` లోగో అండ్ టీజ‌ర్ లాంచ్‌!!

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్ హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నా పేరు రాజా`. రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం లోగో మ‌రియు టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా హీరో రాజ్ సూరియ‌న్ మాట్లాడుతూ…“నేను హీరోగా తిరుగుబోతు, జ‌టాయువు సినిమాలు చేసాను. `నా పేరు రాజా` నా మూడో సినిమా. ఇది తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందిస్తున్నాం. ద‌ర్శ‌కుడు అశ్విన్ అద్బుత‌మైన క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రెండు నెల‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాత కిర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…“ నిర్మాత‌గా ఇది నా మూడో సినిమా. ఇప్ప‌టిటికే షూటింగ్ పూర్తైంది. మ‌నాలి, హైద‌రాబాద్, కేర‌ళ లో షూటింగ్ పూర్తి చేసాం. ఇందులో ల‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన అంశాల‌న్నీ మెండుగా ఉన్నాయి. రెండు నెల‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ…“డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైర‌క్ట‌ర్ ప్ర‌తి సీన్ అద్బుతంగా తీసాడు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా అన్ని విధాల స‌హ‌క‌రించారు“ అన్నారు.
హీరోయిన్స్ మాట్లాడుతూ…“ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.
ద‌ర్శ‌కుడు అశ్విన్ కృష్ణ మాట్లాడుతూ…“డైర‌క్ట‌ర్ గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , ముర‌ళీమోహ‌న్ గార్ల వంటి పెద్ద డైర‌క్ట‌ర్స్ వ‌ద్ద నేను ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో గత 20 ఏళ్లుగా ప‌ని చేస్తున్నా. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. హీరో క్యార‌క్ట‌ర్ లో త్రీ షేడ్స్ ఉంటాయి. అవి ఏంట‌నేవి స్క్రీన్ పైనే చూడాలి. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ పాత్ర‌లు కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. తెలుగు, క‌న్న‌డలో రూపొందుతోన్న బైలింగ్వ‌ల్ ఫిలిం ఇది. ల‌వ్, ఎమోష‌న్, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని రకాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో ఈ సినిమాను తెర‌కెక్కించాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః ఎ.వెంక‌ట్; ఎడిట‌ర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మాద‌; కొరియోగ్రాఫ‌ర్ః న‌గేష్‌.వి; లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి, అర్మాన్‌; నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VpTHvo

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...