Skip to main content

దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

డివైన్ విజ‌న్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై డివిజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మ‌కుమారీస్ స‌మ‌ర్పిస్తున్నచిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్‌. వెంక‌టేష్‌గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ్‌మోహ‌న్ గ‌ర్గ్‌, ఐఎంఎస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ‌శ్వీమ‌నోజ్ఞ, త్రియుగ‌మంత్రి, రాజ‌సింహ వ‌ర్మ‌ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చిలో హిందీలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శాంతి, ప్రేమ విలువ‌ల‌తోకూడిన న‌వ ప్ర‌పంచ పున‌రుద్ధ‌ర‌ణ మ‌హాకార్యం వంటిది ఈ చిత్ర క‌థాంశం. అద్భుత‌మైన ఆడియో విజువ‌ల్స్ ఈ చిత్రం యొక్క మ‌రో ప్ర‌త్యేకత‌. ఈ సంద‌ర్భంగా ఆడియో మ‌రియు ట్రైల‌ర్‌ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ… ఈ చిత్రం ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంచ్ నా చేతుల మీదుగా జ‌ర‌గ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. మ‌న భార‌త‌దేశంలో ఉన్నన్ని మ‌తాలు మ‌రే దేశంలోనూ ఉండ‌వు. అయినా కూడా మ‌న‌దేశంలో ఎమోష‌న్స్ అనేవి చాలా ఎక్కువ‌. అవి ఇప్ప‌టికీ ఇంకా అలానే ఉన్నాయి. ఈ సినిమా ఆడియోని ఇలా చేస్తార‌ని తెలిసుంటే నేను ఇంకా బాగా డిజైన్ చేసేవాడ్ని. బ్ర‌హ్మ‌కుమారీస్‌వాళ్ళు ఇక ముందు ఇటువంటి సినిమాలు తియ్య‌ద‌లుచుకుంటే న‌న్ను పిలిస్తే త‌ప్ప‌కుండా నేను మీ వెంట వుంటాను అని అన్నారు. అంతేకాక ఈ సినిమా విడుద‌ల‌కు నానుంచి మీకు ఎటువంటి స‌హాయం కావాల‌న్నా త‌ప్ప‌కుండా చేస్తాను అని అన్నారు. నా వ‌ల్ల ఎవ‌రికీ మంచి జ‌ర‌గ‌క‌పోయినా ప‌ర్వాలేదు కాని చెడు మాత్రం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది నా క‌న్సెప్ట్‌. అందుకే నా సినిమాల వ‌ల్ల వీలైనంత‌వ‌ర‌కూ మంచి మాత్ర‌మే చూపిస్తాను అని అన్నారు.

ల‌య‌న్‌ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ… ఈ చిత్రం ఆడియోను స‌క్సెస్‌ఫుల్ నిర్మాత అయిన దిల్‌రాజు చేతుల‌మీద‌గా లాంచ్ చేయ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం స్పిరిట్యువ‌ల్ ఆర్గ‌నైజేష‌న్స్‌ నుంచి వ‌స్తుంది. చెడు నుంచి మంచి రావాలంటే ఏంటి అన్న క‌థాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మ‌నోజ్ఞ ఈ పాత్ర‌కి చాలా క‌రెక్ట్‌గా సూట్ అయింది. ఆమె ఒక డాక్ట‌ర్‌. క‌మ‌ర్షియ‌ల్ మ‌రియు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ ఆడియో రిలీజ్‌లో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. నిస్వార్ధంగా సేవ చేసే బ్ర‌హ్మ‌కుమారీస్ సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వీళ్ళ భ‌క్తులు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారిలో ఒక ప‌ది మంది ఈ సినిమా గురించి చెప్పినా చాలు మ‌హ‌ర్షికంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం అన్నారు.

కుల్‌దీప్ దీది మాట్లాడుతూ… ఈ క‌థ‌ని తెర‌కెక్కించేందుకు డైరెక్ట‌ర్ మ‌రియు ప్రొడ్యూస‌ర్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. చాలా మంచి క‌థ ఇది. ఈ ఈవెంట్‌ని చేయ‌డానికి స‌హాయం చేసిన సాయి వెంక‌ట్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. తెలుగులో ఈ చిత్రం విడుద‌ల‌వుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దేశాల్లో మా భ‌క్తులు ఉన్నారు అన్న‌ది కూడా ఈ చిత్రం ద్వారా మాకు బాగా తెలిసింది. ఇక్క‌డ‌కు విచ్చేసిన జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌డ్జి ర‌మేష్‌గారికి, నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

తేజ‌శ్వీ మ‌నోజ్ఞ మాట్లాడుతూ… ఈ చిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. మొద‌టి సినిమానే ఇంత మంచి డివోష‌న్‌కి సంబంధించి చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. గాడ్ ఆఫ్ గాడ్స్ అన్న‌ది ప్ర‌త్యేకించి ఒక మ‌తానికి సంబందించిన చిత్రం కాదు. అంద‌రూ తప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది అని అన్నారు.

డైరెక్ట‌ర్ వెంట‌క్ గోపాల్ మాట్లాడుతూ… ఈ సినిమా చాలా సెన్సిటివ్ స‌బ్జెక్ట్‌. ఎవ్వ‌రినీ నొప్పించ‌కుండా చెయ్యాల్సిన చిత్ర‌మిది. భ‌గ‌వంతుడు ఒక్క‌డే అన్న విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించాల్సిన విష‌య‌మిది అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ఐ.ఎం.ఎస్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ క‌థ చాలా మంచిది. ఎంతో క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించాం. యు.ఎ స‌ర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రం అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో తీసిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని సంగీతం కూడా చాలా బాగా కుదిరింది అని అన్నారు. ఈ చిత్రాన్ని మెక్సికో, ముంబ‌యి, చెన్నై, యు.కె. మ‌రియు యు.ఎస్‌లో చిత్రీక‌రించ‌డం జరిగింది అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేనిశివ‌, జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌డ్జిర‌మేష్‌, తోట‌చిన్ని, జివికెరావ్‌, నిర్మాత ఐఎంఎస్‌రెడ్డి, శివ బికె. త‌దిత‌రులు పాల్గొన్నారు.

తేజ‌స్విని మ‌నోజ్ఞ‌, త్రియుగ మంత్రి, రాజ‌సింహ‌వ‌ర్మ‌, శివ మ‌రియు బ‌బు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ల‌క్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌జీ, ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌రియు విశ్వ‌మ‌ల్లిక్ గాయ‌నీ గాయ‌కులుః శ్రేయా ఘోష‌ల్‌, ర‌మ్య‌బెహ‌రా, మ‌నోజ్‌నెగీ, ప్ర‌వీణ‌చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌స‌న్న‌, రాణియా డాగెర్‌, లోకేష్ వ‌సంత‌, హేమ‌చంద్ర‌, క‌ళ్యాణ‌, డీప్‌దేవ్‌, రామ‌క్రిష్ణ‌, మొ. త‌దిత‌రులు గాత్రాన్ని అందించారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/30tY5s0

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...