తమిళ హీరో జై ని నేను ప్రేమించలేదు అంటూ కుండబద్దలు కొట్టింది హీరోయిన్ అంజలి . తాజాగా ఈ భామ నటించిన ” లిసా ” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగగా మీడియా ముందుకు వచ్చిన అంజలి తన ప్రేమ విషయాన్నీ గురించి చెప్పింది . జై తో నేను రిలేషన్ లో ఉన్నట్లుగా నేనెక్కడా చెప్పలేదని , ఇక సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను పెడుతుంటామని అలా వచ్చిన పిక్స్ చూసి ఏదో అనుకుంటున్నారని అందుకు నేను బాధ్యురాలిని కాదు అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది .
అయితే ఈ భామ జై తో లవ్వాయణం లేదు అని చెప్పుకుంటున్నప్పటికీ ఆమధ్య ఈ జై – అంజలి కలిసి చేసిన హంగామా అంతాఇంతా కాదు . పైగా ఒకరి పై ఒకరి ఉన్న ప్రేమని ఒలకబోస్తూ వీళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు . కట్ చేస్తే ఇద్దరి మధ్య ఎక్కడో తేడా కొట్టింది దాంతో నేను జై ని ప్రేమించలేదని అంటోంది అంజలి . ఈ భామ నటించిన లిసా 3 డి చిత్రం కావడం అందునా హర్రర్ చిత్రం కావడంతో లిసా పై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి . ఈ 3 డి చిత్రానికి సురేష్ కొండేటి నిర్మాత .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2W90FEB

Comments
Post a Comment