Skip to main content

ఇట్లు అంజ‌లి` ట్రైల‌ర్ లాంచ్‌

శ్రీకృష్ణ వొట్టూరు స‌మ‌ర్ప‌ణ‌లో ఓమా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై శ్రీ కార్తికేయ‌, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా న‌వీన్ మ‌న్నేల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఇట్లు అంజ‌లి`. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ హీరో శ్రీకాంత్, ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…“ ట్రైల‌ర్ , పాట‌లు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమా, త‌న‌తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుక‌రావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ…“ట్రైల‌ర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ట్రైల‌ర్ లో త‌న ప‌ర్ఫార్మెన్స్ చాలా బావుంది. హీరోగా త‌న‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నా“ అన్నారు.
ద‌ర్శ‌క నిర్మాత న‌వీన్ మ‌న్నేల మాట్లాడుతూ…“నాకు ఇష్టమైన హీరో శ్రీకాంత్ గారు, ద‌ర్శ‌కుడు మారుతిగారు మా ఫంక్ష‌న్ కు వ‌చ్చి వారి చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్రేమ‌లేఖ ఆధారంగా సాగే ఇదొక డిఫ‌రెంట్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన థ్రిల్ల‌ర్స్ క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి సినిమా చేసాం. మా క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది“ అన్నారు.
హీరో శ్రీ కార్తికేయ మాట్లాడుతూ…“ఆ న‌లుగురు` సినిమాలో అప్పడాల కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసా. హీరోగా ఇది నా తొలి సినిమా. ప్రొడ్యూసింగ్, డైర‌క్ష‌న్ రెండూ చాలా ట‌ఫ్ జాబ్స్. అయినా మా న‌వీన్ గారు రెండింటినీ స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. అలాగే కార్తిక్ కొడ‌కండ్ల అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగా కుదిరింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆద‌రించిన నన్ను హీరోగా కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు కార్తిక్ కొడ‌గండ్ల మాట్లాడుతూ…“న‌వీన్ గారు పూర్తి స్వేచ్ఛ నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌గ‌లిగాను. ప్ర‌తి పాట సంద‌ర్భాను సారంగా సాగుతుంది“ అన్నారు.
హీరోయిన్స్ హిమాన్షీ , శుభాంగి పంత్ మాట్లాడుతూ…ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది“ అన్నారు.
శ్రీ కార్తికేయ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమాలో కాదంబ‌రి కిర‌ణ్‌, అనంత్, ` ఈ రోజుల్లో` వెంకీ, జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్‌, నారి త‌న‌క‌ల‌, ఆర్తి నాగ‌వంశం, సాహితి, స్వ‌రూప‌, ధ‌నుష్‌, సంజ‌య్, న‌వీన్ కుమార్, అర్జున్, మ‌హేంద్ర నాథ్, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతంః కార్తిక్ కొడ‌కండ్ల‌; సినిమాటోగ్ర‌ఫీః వి.కె.రామ‌రాజు; ఎడిటింగ్ః మార్తాండ కె వెంక‌టేష్‌; క‌థ‌-స్క్రీన్ ప్లే- డైలాగ్స-నిర్మాత – ద‌ర్శ‌క‌త్వంః న‌వీన్ మ‌న్నేల‌.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WuZhc3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...