తన అద్భుతమైన సంగీతంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ్‌లో టాప్ హీరోల ల్యాండ్ మార్క్ సినిమాలకు సూపర్‌హిట్ సంగీతాన్ని అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు దేవి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ చిత్రం ‘సింగం’, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ని మ్యూజికల్‌గా కూడా సూపర్‌హిట్ చేశారు దేవి. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ నటించిన 25వ సినిమా ‘మహర్షి‘ చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2LwLwc7
Comments
Post a Comment