Skip to main content

శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.

 

‘ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులందరికి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో సెటిల్‌ అవ్వాల‌నుకుంటాడు. ఇంతలో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడ‌నేది తెలియాలంటే మా ‘ఇట్లు’ సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు దర్శకుడు రోశి రెడ్డి పందిళ్ళ‌ప‌ల్లి. అమీర్‌, శిరీష, అశ్విత హీరోహీరోయిన్లుగా రోశి రెడ్డి పంది ళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు’. శ్రీజా ఆర్ట్స్‌ పతాకంపై రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల‌, డా॥రఘు, డా॥శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్ నివ్వగా, శ్రీమతి వాణి(ఎం ఎఫ్ టి ఐ) కెమెరా స్విచాన్‌ చేశారు. మద్దూరి వెంకట కృష్ణ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర దర్శకుడు రోశి రెడ్డి మాట్లాడుతూ, ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను. రెండు, మూడు ల‌ఘు చిత్రాల‌ను రూపొందించాను. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నా. యాక్షన్‌, థ్రిల్ల‌ర్‌, రొమాన్స్‌, కామెడీ అంశాల‌ మేళవింపుగా సినిమాని రూపొందిస్తున్నా. ‘ఇట్లు’ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది సస్పెన్స్‌. ద‌ర్శ‌కుడిగా నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు, అలాగే మా గురువులు మద్దూరి వెంకట కృష్ణమోహన్‌, నారాయణరావుల‌కు ధన్యవాదాలు’ అని అన్నారు.
నటుడు నారాయణరావు మాట్లాడుతూ, ‘నేను, కృష్ణమోహన్‌ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాం. మా శిష్యుడు ఈ సినిమాని రూపొందించడం ఆనందంగా ఉంది. కొత్తవారిని తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ టీమ్‌ని ఎంకరేజ్‌ చేయాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.
మద్దూరి వెంకట కృష్ణ మోహన్‌ చెబుతూ, ‘రోశి రెడ్డి తన స్నేహితుల‌ సహకారంతో ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’ అని చెప్పారు.
నిర్మాత రాజ గౌడ్‌ మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో ఇది మొదటి చిత్రం. రోశి రెడ్డి గత 12ఏండ్లుగా తెలుసు. ఆయన ఈ కథని నెరేట్‌ చేసిన విధానం బాగా నచ్చి నిర్మించేందుకు ముందుకు వచ్చాం’ అని తెలిపారు.
మ‌రో నిర్మాత డా.ర‌ఘు మాట్లాడుతూ, సింగ‌ర్ అవ్వాల‌ని డాక్ట‌ర్ అయ్యాను. క‌ర్నాట‌క క్లాసిక‌ల్ సంగీత నేర్చుకున్నా. ఈ సినిమాతో నిర్మాత‌గా మార‌డం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.
హీరో అమీర్‌ చెబుతూ, ‘హీరోగా నాకిది తొలి చిత్రం. ఇందులో యువ రైతు పాత్ర పోషిస్తున్నా’ అని అన్నారు.
హీరోయిన్‌ శిరీష మాట్లాడుతూ, ‘ఇందులో నేను పూజిత పాత్రలో కనిపిస్తా. కథానాయికగా తొలి చిత్రం. అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతల‌కు థ్యాంక్స్‌’ అని తెలిపారు.
మరో హీరోయిన్‌ అశ్విత చెబుతూ, ‘ఇందులో మెడికో స్టూడెంట్‌గా నటిస్తున్నా. సినిమాని సక్సెస్‌ చేయాల‌ని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రఘు, మెట్టయ్య, రాజ గౌడ్, శ్రీరాములు , ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎర్రం వేణు, సినిమాటోగ్రఫీ: మల్లేష్‌ నాయుడు, పి. ఆర్.ఓ: కడలి రాంబాబు మాటలు: మద్దూరి వెంకట కృష్ణమోహన్‌, నిర్మాత‌లు : రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల‌, డా॥రఘు, డా॥శ్రీరాములు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోశి రెడ్డి పందిళ్లపల్లి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YKntIq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...