Skip to main content

ఎర్రచీర’ టైటిల్‌ లోగో ఆవిష్కరణ

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సీహెచ్‌ సుమన్‌బాబు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం టైటిల్‌ లోగో ఆవిష్కరణ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో గురువారం రాత్రి జరిగింది. సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్‌ మనవరాలు ‘మహానటి‘ ఫేమ్‌ సాయి తుషిత టైటిల్‌ లోగోను ఆవిష్కరించింది.

అనంతరం దర్శకనిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ ‘మదర్‌ సెంటిమెంట్‌’ హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రధాన అంశాలుగా యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ‘శ్రీరామ్‌’ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో రెండు చిత్రాలు చేశాను. తెలుగులో తొలిసారి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాను. మహానటి చూసి సాయి తుషితను ఎంపిక చేసాం. హీరోయిన్‌గా నటించిన కారుణ్య డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఈ పాత్రకోసం శంభోశివశంభోలో చేసిన ఆమె పెర్‌ఫార్మెన్స్‌ నచ్చి ఎంపిక చేశాం. కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. అంతేకాకుండా ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్‌ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై షూట్‌ చేయనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వెళతామని చెప్పారు. బేబి సాయి తుషిత మాట్లాడుతూ.. మా తాతగారితో మహానటి నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్రపోషిస్తున్నానని చెప్పారు. కారుణ్య మాట్లాడుతూ.. ఇందులో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ పాత్రలో రెండు షేడ్స్‌ వున్నాయి. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మంచి పేరు తెస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. నటుడు భద్రం మాట్లాడుతూ… ఇటువంటి మంచి కథా చిత్రాలు మరిన్ని తెలుగులో రావాలి. నేను ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా వుందని పేర్కొన్నారు. రచయిత గోపీవిమలపుత్ర మాట్లాడుతూ ‘సుమన్‌ బాబు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. సంభాషణలకు మంచి పేరు వస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. ఇంకా సినిమాటోగ్రాఫర్‌ చందు, ఎడిటర్‌ వెంకట్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wdH2N7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...