Skip to main content

`సీత‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో `ఆర్ఎక్స్100` భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రత్యేక గీతంలో నటించారు. మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్‌ను నేను లైఫ్‌లో ఇప్పటివరకు కలవలేదు. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ‘సీత’ సినిమాలో నేను చేసిన రఘురామ్ అనే పాత్ర ఛాలెంజింగ్ రోల్. సినిమా చూశాక నా క్యారెక్టర్‌కు తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా నాకు ఒక యాక్టర్‌గా మంచి రెస్పెక్ట్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరో అంటే ఫస్ట్ కనిపించాలి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. సోనూసూద్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. మన్నారాచోప్రాతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా నటించారు. మా ప్రొడ్యూసర్ అనిల్‌గా మా అందరినీ మేనేజ్ చేసి చాలా బాగా చూసుకున్నారు. మా నాన్నగారి బ్యానర్ తర్వాత ఇంత పెద్ద బ్యానర్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. అనూప్ రుబెన్స్ గారు ఆర్ఆర్‌తో చాలా బాగా ఆకట్టుకున్నారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంది.’’ అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ నేను నర్వస్ ఫీలవుతున్నా. సీత సినిమాతో చాలా నేర్చుకున్నా. ఇదొక బ్రిలియంట్ జర్నీ. సోనూసూద్ వండర్‌ఫుల్ కోస్టార్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. తేజగారు నా గురు, నా మెంటర్, గైడ్. ఆయన లేకపోతే నేను ఈ స్టేజీపై ఉండేదాన్ని కాదు. తేజగారి స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నాను. సీత సినిమాతో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణ పడి ఉంటాను.’’ అన్నారు.

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. ‘‘నాకు మట్లాడడం రాదు. మైక్ ఇచ్చినప్పుడల్లా బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతోంది. ఈ మధ్య చాలావాటికి బ్లాంక్ అయిపోతోంది. సినిమా ఎలా వచ్చిందని నిన్న బెంగళూరులో అడిగారు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. కానీ మాములుగా అందరూ ఏం చెప్తారు.. చాలా బాగా వచ్చింది.. సూపర్‌గా వచ్చిందని, కానీ అబద్ధం చెప్పలేం.. నిజమూ చెప్పలేం. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా. 90శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా అంతా తీసేసి పరుచూసి బ్రదర్స్‌ను పిలిచి చూడమన్నాను. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరిచేశా. ఎందుకంటే నాది అంత ఇంటలిజెంట్ బ్రెయిన్ ఏం కాదు.. కళ్లజోడు పెట్టుకుని ఏదో అలా కనిపిస్తా కానీ, యావరేజ్ బ్రెయిన్ నాది. చూసేవాళ్లు ఏమనుకుంటారంటే..కళ్లజోడు చూడగానే మేధావని అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. ఈ సినిమాలో హీరో చాలా బాగా చేశాడు. హీరో యాక్షన్, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ బాగా చేస్తాడు. మీరు రెగ్యులర్‌‌‌గా చూసే ఆ కమర్షియల్ స్టయిల్ నాకు చేతకాదు. వేరే స్టయిల్‌లో చూపించాను. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. హీరోయిన్ కాజల్ కూడా చాలా బాగా చేసింది. సోనూ సూద్ గారు నేను అనుకున్నదాని కంటే చాలా బాగా చేశారు. అనూప్ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేశాడు. వీళ్లందిరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే ఇవ్వగలరు. ఈ నెల 24న సినిమా చూసి మీరే గ్రేడింగ్ ఇవ్వండి. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ఆడియెన్సే మాకు దేవుళ్లు. మీరంతా బాగుండాలి.’’ అన్నారు.

సోనూ సూద్ మాట్లాడుతూ..‘‘ఇటీవల ఒక ఫంక్షన్‌లో నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కదా.. మీ ఫెవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగారు. నేను వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది తెలుగు లాంగ్వేజే. తెలుగు ఇండస్ట్రీ నా ఫేవరెట్ ఇండస్ట్రీ. ఇక్కడున్న టెక్నీషియన్స్ ఎంతో ప్రేమగా చూస్తారు. నా డేట్స్ ఖాళీ లేకపోయినా నా కోసం నెలరోజులు వెయిట్ చేసి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజగారికి ధన్యవాదాలు.’’ అన్నారు.

న‌టీన‌టులు:
బెల్లంకొండ శ్రీనివాస్‌
కాజ‌ల్ అగ‌ర్వాల్‌
మ‌న్నారా చోప్రా
సోనూ సూద్‌
త‌నికెళ్ల భ‌ర‌ణి
అభిన‌వ్ గోమ‌టం
అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శక‌త్వం: తేజ‌
నిర్మాత‌: రామబ్ర‌హ్మం సుంక‌ర‌
బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి
కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌పీ: శిర్షా రే
ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ప‌బ్లిసిటీ ఇన్‌చార్జ్‌: విశ్వ సి.ఎం
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2W8zKsz

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...