Skip to main content

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రొమాంటిక్ క్రిమినల్స్

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేసిన పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందింది. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాల‌కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజు  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆంధ్రప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నం లో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ స్టూడియో రిసాలి స్టూడియో లో జరిగాయి.  విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. అలాగే వినోదం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇందులో మనోజ్ నందం ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. అతిన్ని ఇష్టపడే సీనియర్ స్టూడెంట్ గా అవంతిక, డ్రగ్ పెల్లర్ గా వినయ్, 9వ తరగతి విద్యార్థిగా మౌనిక, కొత్తగా పెళ్లైన గృహినిగా దివ్య బాగా నటించారు. సున్నితమైన అంశాల్ని బోల్డ్ గా చూపించారు. ముసుగులు వేసుకున్న అమ్మాయిల కథ. మితిమీరిన వ్యసనాల్ని ఈ చిత్రంలో సున్నితంగా చర్చించారు. మ్యాంగో  ఆడియో ద్వారా పాటలు విడుదల చేయనున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన బి.బాపిరాజు మాట్లాడుతూ…. శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్‌, శ్యావ్యాఫిలింస్ బ్యాన‌ర్ లో పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో విడుద‌ల‌యిన ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ త‌ర‌హ‌లో సీక్వెల్ గా రొమాంటిక్ క్రిమిన‌ల్స్ తెర‌కెక్కించాం. ఈ సినిమా పూర్తిగా న‌వ్యాంధ్రలో స్మార్ట్‌సిటీగా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటీ విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ జ‌రుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల ర‌హ‌స్యాన్ని ఆద్యంతం ఆసక్తిక‌రంగా  తీర్చిదిద్దాం. గ‌త రెండు చిత్రాల‌ కంటే కూడా ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంది. యువ‌తని ప‌ట్టిపీడించే వ్య‌స‌నాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ లో  హీరోగా మ‌నోజ్ నంద‌న్‌,  విల‌న్ గా వినోద్ , హీరోయిన్స్ అవంతిక‌, దివ్య‌, మౌనిక లు చాలా చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌ర్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి తోట‌లో పోలీసుల భ‌ద్ర‌త మ‌థ్య ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. వ్య‌స‌నాలు ఏమైనా వాటి ప‌ర్య‌వ‌ససానాలు తీవ్రంగా వుంటాయ‌నే పాయింట్ ని… వినోదం పాళ్ళు త‌గ్గించ‌కుండా మా ద‌ర్శ‌కుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కుంటుంది ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలూ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్ పొందింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అని అన్నారు
ద‌ర్శ‌కుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా రొమాంటిక్ క్రిమిన‌ల్స్ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. న‌టీన‌టులు కూడా చాలా చ‌క్క‌గా పాత్ర‌ల్లో ప‌ర‌కాయ‌ ప్ర‌వేశం చేశారు. ముందు రెండు చిత్రాల్ని మించి వినోదం తో పాటు చ‌క్క‌టి మెసేజ్ వుంటుంది. ఈ చిత్రానికి ఎస్‌.వి. శివ‌రామ్ సినిమాటోగ్ర‌ఫి హైలైట్ అవుతుంది, విశాఖ, అర‌కులోని అందాలే కాకుండా గంజాయి తోట‌ల్లో పోలీసుల దాడి చేసే స‌న్నివేశాలు చాలా చ‌క్క‌గా చిత్రీక‌రించాం. శామ్యూల్ క‌ళ్యాణ్ ఎడిటింగ్ సినిమా ఫేజ్ ని పెంచేలా వుంది. సుధాక‌ర్ మారియో సంగీత సార‌థ్యంలో నాలుగు పాట‌లు చాలా చక్క‌గా కుదిరాయి. అని  అన్నారు.
న‌టీన‌టులు… మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక , ఎఫ్‌.ఎమ్ బాబాయ్, బుగ‌తా, స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌     త‌దిత‌రులు..
సాంకేతిక వ‌ర్గం..
పాటలు ..బాల వ‌ర్ద‌న్‌
సంగీతం.. సుధాక‌ర్ మారియో
కెమెరా.. ఎస్‌.వి. శివ‌రామ్‌
ఎడిటింగ్‌.. శామ్యుల్ క‌ళ్యాణ్‌
పి అర్ ఓ .. ఏలూరు శ్రీను
స‌హ‌నిర్మాత‌లు.. వైద్య‌శ్రీ డాక్ట‌ర్ ఎల్ ఎన్ రావు, డాక్ట‌ర్ కె.శ్రీనివాస్‌,
నిర్మాత‌లు..  బి.బాపిరాజు, ఎక్కలి ర‌వింద్ర‌బాబు
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం…. పి.సునీల్ కుమార్ రెడ్డి


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VpK7Zr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...