Skip to main content

‘సెవెన్’ వ‌రల్డ్‌వైడ్ రైట్స్‌ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

‘ఐ థింక్… అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ – ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు. ముగ్గులోకి దింపాడు. అతడి కథేంటి అనేది జూన్ 5న తెలుస్తుంది.

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల అయింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

అభిషేక్ నామా మాట్లాడుతూ “ఇటీవల ‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్ల‌ర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే… హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక… విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ – దర్శకత్వం నిజార్ షఫీ.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WM330N

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...