
మహానటి చిత్రంతో యావత్ ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం టైం మిషన్ నేపథ్యంలో సాగే చిత్ర కథ రూపకల్పనలో ఉన్నాడు . చిరంజీవి కూడా మహానటి చిత్రాన్ని చూసి నాగ్ అశ్విన్ ప్రతిభకు ఫిదా అయ్యాడు . అంతేకాదు పాతాళభైరవి లాంటి కథ ఉంటే రెడీ చెయ్ తప్పకుండా నీ దర్శకత్వంలో చేస్తాను అని మాట కూడా ఇచ్చాడు . దాంతో చిరంజీవి కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడు నాగ్ . స్క్రిప్ట్ పక్కాగా రూపొందితే చిరంజీవి తోనే ఈ మహానటి దర్శకుడి సినిమా ఉండనుంది .
English Title: Nag Ashwin next film with chiranjeevi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2T4T6JR
Comments
Post a Comment