Skip to main content

ఉత్కంఠతను పెంచే యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘‘కురుక్షేత్రం’’

Arjun Kurukshetram Press meetయాంక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150 సినిమా కురుక్షేత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్దం అయ్యింది. తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీని అత్యంత స్టైలిష్ గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ఈమూవీని భారీగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

తమిళ నిర్మాత ఉమోష్ మాట్లాడుతూ:
‘ప్యాషన్ స్టూడియో నుండి మేం నిర్మించిన రెండో చిత్రం ఈ కురుక్షేత్రం. తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో అంతకంటే మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాటిలో సిద్దార్ధ హీరోగా ఒక ప్రాజెక్ట్ ఉంది. తెలుగు ప్రేక్షకులు మా మొదటి సినిమా ‘ పాండవులలో ఒకడు’ ను మంచి గా ఆదరించారు. కురుక్షేత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు.

దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ:
‘కురుక్షేత్రం తెలుగు లో మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్న టైంలో నిర్మాతలు సాయి, శ్రీనివాస్ లు కలిసారు. తెలుగు లో వారు చిన్న మార్పులను సూచించారు. తెలుగు లో సినిమా ఇంకా గ్రిప్పింగ్ ఉండేలా చేసాం. క్రైం యాక్షన్ ని ఇష్టపడే వారిని తప్పకుండా థ్రిల్ చేస్తుంది. నాకు తెలుగు ప్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకని తెలుగు రిలీజ్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది ’ అన్నారు.

కో ప్రొడ్యూసర్ లలో ఒకరైన సాయి కృష్ణ పెండ్యాల మాట్లాడుతూ:
‘ కురుక్షేత్రం తెలుగు లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వినాయక చవితికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. అర్జున్ సినిమా నుండి ఆశించిన ఎలిమెంట్స్ అన్నీ కురుక్షేత్రం లో ఉంటాయి. తెలుగు లో మంచి విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాను అన్నారు.

మరోనిర్మాత మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ:
‘దాదాపు రెండు వందలకు పైగా థియేటర్స్ లో వినాయకచవితికిఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. అర్జున్ 150 సినిమా ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ’ అన్నారు.

 

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో ఇంకా సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు :

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్

సంగీతంః ఎస్. న‌వీన్,

మాటలు- శశాంక్ వెన్నెలకంటి

సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌,

ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌,

స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్

కో ప్రొడ్యూసర్ – సాయి కృష్ణ పెండ్యాల

నిర్మాత – శ్రీనివాస్ మీసాల, ఫ్యాషన్ స్టూడియోస్

క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wOJDO2

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...