నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా . నానా పటేకర్ తో నటించిన సమయంలో ఓ పాట చిత్రీకరిస్తున్న సందర్భంగా నన్ను తాకుతూ ఇబ్బందిపెట్టాడని , అసలు డ్యాన్స్ మాస్టర్ ని పక్కనపెట్టి తానే డ్యాన్స్ మూమెంట్స్ చెబుతూ నాపై చేతులు వేస్తూ చాలా అసహ్యంగా ప్రవర్తించాడని అందుకే ఆ పాట చేయనని వెళ్లిపోయానని దాంతో మరొకరితో ఆ పాట చేసారని సంచలన వ్యాఖ్యలు చేసింది తనుశ్రీ దత్తా . నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర చిత్రంలో నటించింది తనుశ్రీ దత్తా . అలాగే మరో తెలుగు చిత్రంలో నటించినప్పటికీ రెండు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో ఈ భామకు తెలుగులో మళ్లీ ఛాన్స్ రాలేదు.
అలాగే బాలీవుడ్ లో కూడా ఈ భామకు సినిమాలు లేకుండాపోయాయి. బాలీవుడ్ లో సినిమాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా….. నానా పటేకర్ పై ఆరోపణలు చేయడమే ! అయితే తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పట్లో మీడియా కొద్దిరోజులు తెగ హడావుడి చేసింది కానీ తర్వాత ఆవిషయం మరుగున పడిపోయింది. ఇక ఈ భామకు ఛాన్స్ లు లేకపోవడంతో అమెరికా వెళ్లిపోయింది. ఇక ఇటీవల ఇండియాకు తిరిగివచ్చిన తనుశ్రీ దత్తా రజనీకాంత్, అక్షయ్ కుమార్ లపై నిప్పులు చెరిగింది. నానా పటేకర్ లాంటి వెధవలతో అంతటి పెద్దవాళ్ళు కలిసి నటిస్తుంటే ఇక అలాంటి వాళ్లకు నష్టం ఎలా ఉంటుందని , మేము గ్లామర్ పాత్రల్లో నటించినంత మాత్రాన మమ్మల్ని నిజ జీవితంలో కూడా అలాగే ఊహించుకొని ఎవడు పడితే వాడు మా మీద చేయి వేస్తామంటే ఎలా ఊరుకుంటామని ఆవేశంతో ప్రశ్నిస్తోంది.
English Title: Tanusree dutta sensational comments on nana patekar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xPWa3u
Comments
Post a Comment