హీరోగా సంచలనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని కూడా హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసాడు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే , కాగా ఇప్పుడు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది. ఆనంద్ విజయ్ దేవరకొండ , శివాత్మిక జంటగా మహేంద్ర దర్శకత్వంలో సినిమా రానున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా మాత్రం డేట్ ఫిక్స్ అయ్యింది.
ఇంతకీ విజయ్ దేవరకొండ తమ్ముడి కొత్త సినిమా ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలుసా……. అక్టోబర్ 10. అవును అక్టోబర్ 10న ఈకొత్త సినిమా ప్రారంభం కానుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మహేంద్ర దర్శకుడిగా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తో పాటుగా పెద్ద కూతురు శివాని కూడా హీరోయిన్ లు కావడంతో ఆ హీరో ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడటం ఖాయమని అంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన రాజశేఖర్ కాలక్రమంలో రేసులో లేకుండాపోయాడు దాంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాడు.
English Title: Vijay devarakonda brother turned hero
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OhVcqR
Comments
Post a Comment