విజయ్ దేవరకొండని నోటా చిత్రం ఇబ్బందిపెడుతోంది . నోటా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అయినప్పటికీ ఈ సినిమా చుట్టూ రాజకీయాలు చేరడంతో విసుగుచెందుతున్నాడు విజయ్ దేవరకొండ . అక్టోబర్ 4 న లేదా 5న సినిమా విడుదల చేయాలనీ ముందుగా అనుకున్నారు అంతేకాదు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు కూడా కట్ చేస్తే తెలుగు హక్కుల విషయంలో గొడవ ముదరడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది దాంతో నిన్న సోషల్ మీడియాలో తన బాధని , అశక్తతని వెళ్లగక్కాడు విజయ్ దేవరకొండ .
ఈరోజు నోటా పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది , అలాగే రిలీజ్ ఏ సమయంలో చేస్తే మంచిది అంటూ నెటిజన్లను సలహా కూడా కోరాడు విజయ్ . అయితే ఎక్కువగా అక్టోబర్ 5నే సూచించారు . అక్టోబర్ 5న రిలీజ్ చేస్తారా ? లేదంటే అక్టోబర్ 18న రిలీజ్ చేస్తారా ? అన్నది ఈరోజు సాయంత్రానికి తేలిపోనుంది . అక్టోబర్ 5న వస్తే ఫరవాలేదు కానీ అక్టోబర్ 18 న అంటే మాత్రం దిల్ రాజు ఒప్పుకోడు ఎందుకంటే హలో గురూ ప్రేమకోసమే చిత్రాన్ని అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతున్నాడు కాబట్టి . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నోటా చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించాడు .
English Title: Vijay devarakonda NOTA facing release problem
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MRE1b7
Comments
Post a Comment