అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అవుతుండగా అక్టోబర్11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది అంటే ఆరు రోజుల వ్యవధిలో ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ పోటీపడుతున్నారన్నమాట . నిస్సందేహంగా ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరో అందునా మాస్ హీరో అయినప్పటికీ విజయ్ దేవరకొండ ని తక్కువగా అంచనా వేయలేం ఎందుకంటే కేవలం ఐదేళ్ల కాలంలోనే సత్తా చాటాడు అందునా రెండేళ్ల కాలంలోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ లు మూడు అందుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం ఈ మూడు చిత్రాలు మూడు రకాలుగా తెరకెక్కాయి కానీ సంచలనాల విషయంలో మాత్రం ఒకే పోలిక ఉంది ఈ మూడు చిత్రాలకు. సడెన్ స్టార్ అయిపోయాడు ఈ మూడు చిత్రాలతో విజయ్ దేవరకొండ .
ఎన్టీఆర్ నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ దుమ్ము దులిపాడు . బ్లాక్ బస్టర్ లను అందుకున్న ఎన్టీఆర్ ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ లలో నెంబర్ 3 గా రాణిస్తున్నాడు. ఇప్పటికే వరుస హిట్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ కు తాజాగా త్రివిక్రమ్ తోడయ్యాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్11న భారీ ఎత్తున అరవింద చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నోటా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కాగా అరవింద సమేత రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అయినప్పటికీ కేవలం 6 రోజుల వ్యవధిలోనే విడుదల అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఇద్దరు హీరోలకు తీవ్ర పోటీ ఉండటం ఖాయం. మరి ఈ పోటీలో విజయం ఎన్టీఆర్ ని వరిస్తుందా ? లేక విజయ్ దేవరకొండని వరిస్తుందా ? చూడాలి.
English Title: Who will win in the race : NTR or Vijay devarakonda ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Inbb1t
Comments
Post a Comment