అగ్ర నిర్మాత దిల్ రాజుపై హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహంగా ఉన్నాడట ! ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమానే రాలేదు మరి ఇద్దరికీ ఎందుకు చెడింది అని అనుకుంటున్నారా ?నోటా అనే రాజకీయ చిత్రం వల్ల ఇద్దరి మధ్య రాజకీయాలు ప్రభావితం చేసాయి . నోటా చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమాని అక్టోబర్ 5న కాకుండా 18 న విడుదల చేస్తే బెటర్ ఏమో అని ఆలోచన చేసాడట విజయ్ దేవరకొండ అయితే అందుకు దిల్ రాజు అస్సలు ఒప్పుకోలేదట ! ఎందుకంటే అక్టోబర్ 18న దిల్ రాజు నిర్మించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అయిపోయాడు కాబట్టి .
అక్టోబర్ 5న రిలీజ్ చేయాలనీ విజయ్ కి ఉంది అయితే అక్టోబర్ 11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది ఎన్టీఆర్ సినిమా అందునా త్రివిక్రమ్ దర్శకుడు కాబట్టి వీలైనంత ఎక్కువ థియేటర్ లలో రిలీజ్ అవుతుంది కాబట్టి నోటా చిత్రాన్ని అక్టోబర్ 11న కొన్ని థియేటర్ ల నుండి తీసేస్తారు దానికి బదులుగా అక్టోబర్ 18న అయితే బాగుండేది అని అనుకున్నాడట విజయ్ దేవరకొండ . అయితే దిల్ రాజు మాత్రం విజయ్ దేవరకొండని కూర్చోబెట్టి మరీ ఒప్పించాడట . దిల్ రాజు మరీ ఒత్తిడి చేయడంతో చేసేదిలేక అయిష్టంగానే విజయ్ దేవరకొండ ఓకే అన్నాడట ! దిల్ రాజు చేతిలో థియేటర్ లున్నాయి అలాగే పెద్ద నిర్మాత కాబట్టి అయిష్టంగానే ఒప్పుకున్నాడు కానీ దిల్ రాజు పై మాత్రం చాలా కోపంగా ఉందట విజయ్ దేవరకొండకు .
English Title: Vijay devarakonda angry on dil raju
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q0gZAC
Comments
Post a Comment