భారీ ప్లాప్ నుండి తప్పించుకున్నాడు స్టార్ హీరో సూర్య . ఇంతకీ సూర్య తప్పించుకున్న భారీ ప్లాప్ ఏంటో తెలుసా …….. సామి . తెలుగులో సామి గా వచ్చిన ఈ చిత్రం తమిళంలో సామి 2 గా రిలీజ్ అయ్యింది . విక్రమ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విక్రమ్ నటించగా సామి చిత్రంలో అరుపులు పెడబొబ్బలు ఉన్నాయి కానీ కథ లేదని అందుకే డిజాస్టర్ అయ్యిందని అంటున్నారు . సినీ విమర్శకుల నుండి మాత్రమే కాకుండా బయ్యర్ల నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయట సామి సినిమా పట్ల .
ఇంతకీ సూర్య ఈ సినిమా నుండి ఎలా తప్పించుకున్నాడు అని అనుకుంటున్నారా ? మొదట ఈ కథ సూర్య దగ్గరకే వెళ్లిందట ! అయితే తనకున్న కమిట్ మెంట్స్ వల్ల ఇప్పుడే చేయలేనని అలాగే కథ సవ్యంగా లేదని నిరాకరించాడట కట్ చేస్తే విక్రమ్ దగ్గరకు వెళ్లడంతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనగానే టక్కున ఒప్పుకున్నాడు కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యింది డిజాస్టర్ అయ్యింది దాంతో విక్రమ్ చాలా బాధపడుతున్నాడట ! ఇక సూర్య ఏమో భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నందుకు థాంక్ గాడ్ అని అనుకుంటున్నాడట . మొత్తానికి ఒకరికి మోదం ఒకరికి ఖేదం అయ్యింది సామి చిత్రం .
English Title: hero suriya great escape from saamy
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QOMH5j
Comments
Post a Comment