Skip to main content

రవిబాబు ‘అదిగో’ ట్రైలర్ లాంచ్…

ravi babu adhugo trailer launchఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్ గా చేసుకొని సబ్జెక్ట్ ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవి బాబు తాజా చిత్రం ‘అదిగో’. రెండున్నర సంవత్సరాల క్రితం మొదలైన ఈ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది..

ట్రైలర్ విడుదలానంతరం రవి బాబు మాట్లాడుతూ.. పంది పిల్లతో సినిమానా..? ఫైనాన్షియల్ ప్రోబ్లేమ్స్ లో ఉన్నావా..?, మానసిక పరిస్థితి బాగానే ఉందా..?, ముస్లిమ్స్ ఇలాంటి సినిమాను చూస్తారా అంటూ ఎన్నో కాన్వాగేషన్స్ మధ్య సినిమా మొదలయ్యింది. ఈ సినిమా రెండున్నర ఏళ్ళు క్రితం మొదలు అయ్యింది. 3డి పంది పిల్లను రియల్ పంది పిల్లగా కన్వెర్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది.. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ. కానీ అదిగో ఆలస్యం అవడంతో.. తనకు ఇది 5సినిమా అయ్యింది… ప్రస్తుతానికి సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఆడియో తో ముందుకు వస్తామని తెలిపారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ… ఇండస్ట్రీలో యానిమల్స్ తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. తమిళంలో కూడా విడుదలవుతోంది ఈ చిత్రం.. అక్కడి నిర్మాత అడిగాడు.. ఇన్ని జంతువులు ఉండగా ఎందుకు పంది పిల్లనే పెట్టి తీస్తున్నారు.. అయినా ఎగ్జైటిమెంట్ తో ఉన్నాను.. అని చెప్పాడు.. ఈ సినిమాలో 3డి పంది పిల్లను చూస్తున్నామా.. లేక రియల్ పంది పిల్లను చూస్తున్నామా అనేలా న్యాచురల్ లైవ్ ఇవ్వడం కోసం ట్రై చేసాము. ఈ సినిమా చేయడానికి రవికి ఉన్న ఓపికను చూసి మెచ్చుకోవాల్సిందే… ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో లవ్ ఎలెమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అదిగో. పిల్లలకు బాగా నచ్చుతుంది.. న్యూ ఎక్స్పరిమెంట్ చేసాము.. తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాము.. ఇందులో సాంగ్స్ చాలా బాగున్నాయి.. టైటిల్ సాంగ్ అయితే అద్భుతంగా వచ్చింది. సిజి వాళ్ళను ఇబ్బంది పెట్టి మరీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము.. మంచి హోప్ తో ఉన్నాము. త్వరలో ఆడియో విడుదల చేసి, సినిమాను సమ్మర్ కు విడుదల చేస్తామని చెప్పారు. పంది పిల్ల లేకుండానే ఉన్నట్టుగా క్రియేట్ చేసి సింగల్ టేకులో అవుట్ ఫుట్ తీసుకున్నాము.. చాలా బాగా బాగొచ్చింది.. అన్నారు విజువల్ ఎఫెక్ట్ చీఫ్ సూపర్ వైజర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ, భాస్కర్ భట్ల, తదితరులు పాల్గొన్నారు.

అభిషేక్ వర్మ, నాభ నటేష్, రవి బాబు, టి. ఉద్య భాస్కర్, ఆర్ కె. వీరేందర్ చౌదరి తదితరులు నటిస్తున్న అదిగో చిత్రానికి స్క్రీన్ ప్లే: సత్యానంద్, డైలాగ్స్: రవి బాబు నివాస్, లిరిక్స్: భాస్కర్ భట్ల, మేకప్: దొడ్డి శ్రీనివాస్, కొరియోగ్రాఫర్: ప్రసన్నా, యాక్షన్: కనల్ కన్నన్, విజయ్, సతీష్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: పల్లా సత్యనారాయణ, కెమెరా: సుధాకర్ రెడ్డి, మ్యూజిక్: ప్రశాంత్ విహారి, కథ-నిర్మాత-దర్శకత్వం: రవి బాబు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2x8DI5N

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...