Skip to main content

సిల్లీ ఫెలోస్ రివ్యూ

silly fellows movie reviewసిల్లీ ఫెలోస్ రివ్యూ:
నటీనటులు : అల్లరి నరేష్ , సునీల్ , జేపీ , పోసాని
సంగీతం : శ్రీ వసంత్
నిర్మాతలు : కిరణ్ , భరత్
దర్శకత్వం : భీమనేని శ్రీనివాస్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 7 సెప్టెంబర్ 2018

వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న హీరోలు అల్లరి నరేష్ , సునీల్ లు కలిసి చేసిన ప్రయత్నం ” సిల్లీ ఫెలోస్ ”. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . తమిళ చిత్రానికి స్వల్ప మార్పులు చేసిన ఈ సిల్లీ ఫెలోస్ తో అల్లరి నరేష్ , సునీల్ లు హిట్ అందుకున్నారా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

ఎం ఎల్ ఏ జాకెట్ జానకిరామ్ (జయప్రకాశ్ రెడ్డి ) ముఖ్య అనుచరులు వీరబాబు (అల్లరి నరేష్ ) సూరిబాబు (సునీల్ ) లు . ముఖ్యంగా వీరబాబు కి జాకెట్ జానకిరామ్ అంటే ఎనలేని ఇష్టం దాంతో ఓ వేడుకలో సూరిబాబు పెళ్లి రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునే పుష్ప (నందిని )తో జరిపిస్తాడు . అయితే అప్పటికే సూరిబాబుకి కృష్ణవేణి (పూర్ణ ) తో పెళ్లి కుదురుతుంది . సూరిబాబు సమస్య తో పాటుగా వీరబాబు లవర్ ఉద్యోగం సమస్య తోడౌతుంది , ఈ రెండింటిని పరిష్కరిస్తాడనుకున్న జాకెట్ జానకిరామ్ మతిస్థిమితం కోల్పోవడంతో అసలు సమస్య మొదలౌతుంది . జాకెట్ జానకిరామ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా ? అతడికి మతిస్థిమితం ఎలా తప్పింది ? వీరబాబు , సూరిబాబు ల సమస్య తీరిందా ? ఇత్యాది విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఫస్టాఫ్
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్

నటీనటుల ప్రతిభ :

అల్లరి నరేష్ వీరబాబుగా తనదైన కామెడీతో అలరించాడు . ఇలాంటి పాత్రలు అల్లరి నరేష్ కు కొట్టిన పిండి కావడంతో అవలీలగా చేసేసాడు. సునీల్ కూడా తన పాత్రతో నవ్వులు పూయించాడు , సూరిబాబు పాత్రకు తన కామెడీ టైమింగ్ తో మరింత వన్నె తెచ్చాడు . నందిని ఫరవాలేదు , చిత్ర శుక్లా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది . పూర్ణ గెస్ట్ అప్పియరెన్స్ తో అలరించింది . జయప్రకాశ్ రెడ్డి , పోసాని , రఘు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

శ్రీ వసంత్ సంగీతం , సిల్లీ ఫెలోస్ కు విజువల్స్ మరింత అందాన్ని ఇచ్చింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇప్పటికే వరుసగా రెండు సినిమాలు హిట్స్ కొట్టి మంచి జోరు మీదున్న నిర్మాతలకు ఇది కూడా మరింత ప్లస్ అయ్యేలాగే ఉంది . ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దగ్గరకు వస్తే ……. రీమేక్ చిత్రాలకు పెట్టింది పేరు భీమనేని అయితే ఈ సినిమాని ఫస్టాఫ్ వరకు బాగానే రాసుకున్నప్పటికీ సెకండాఫ్ పై మరింత దృష్టి పెడితే బాగుండేది . భీమనేని మార్క్ కామెడీ ఉంది అయితే సెకండాఫ్ లో మరింత జోరు చూపిస్తే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలు కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్

English Title: silly fellows movie review



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2M7335B

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...