Skip to main content

సమంత ‘యూ టర్న్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

u turn pre release eventసమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘ యూ టర్న్‘.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు.. కాగా ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరగగా ఈ సమావేశానికి సినిమా నటీనటులతో పాటు నాగార్జున ముఖ్య అతిధిగా వచ్చారు..

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకంటే ముందే పవన్ కుమార్ గారి లూసియా చూసి ఆయనతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను.. యూటర్న్ తో ఆ కోరిక తీరింది. సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వచ్చే వెరైటీ సినిమాల్లో ఈ సినిమా టాప్ అని చెప్పొచ్చు.. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. చిన్న పాయింట్ ని తీసుకుని చాలా బాగా కథ అల్లారు.. ఇక సినిమా హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు.. మొదలయినప్పట్నుంచి రేపు రిలీజ్ అయ్యేంతవరకు చాలా పని చేసింది.. తన కోసం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు..

దర్శకుడు పవన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమా తప్పక ఆడియన్స్ కి నచ్చుతుందని అనుకుంటున్నా.. సమంత గారు ఈ సినిమా లో చాలా బాగా చేశారు.. నాగార్జున గారు ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనేది చూడాలని ఉంది.. అన్నారు..

నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. విజయశాంతి, అనుష్క గారి తర్వాత ఈ జెనరేషన్ లో సూపర్ స్టార్ అంటే సమంత.. ఆవిడతో చాలా టాలెంట్ దాగుంది.. ఈ సినిమాతో మీరు కూడా ఒప్పుకుంటారు.. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తే అది ఫ్లాప్ అయితే ఇందుకు ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమలంటారు.. కానీ ఈ సినిమా మీ అందరికి మంచి అనుభూతిని మిగిలిస్తుంది అన్నారు..

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. క్రౌడ్ ఫండెడ్ మూవీ గా దర్శకుడు పవన్ తీసిన లూసియా మంచి హిట్ అయ్యింది.. ఇప్పుడు యూ టర్న్ తో మరో హిట్ కొట్టబోతున్నాడు.. ట్రైలర్ చూసాను.. చాలా బాగుంది.. సమంత తో ఇదే మాట చెప్పాను.. సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను.. ఒక ఇన్సిడెంట్ తో మొదలయ్యి సినిమా మొత్తం ఫజిల్ లా మరిన్ని మలుపులు తిరిగింది.. ఈ సినిమా ద్వారా వస్తున్న అందరికి గ్రాండ్ వెల్ కం.. సినిమా ద్వారా అందరికి విజయం చేకూరలని..కోరుకుంటూ అందరికి అల్ ద బెస్ట్.. అన్నారు..

సమంత మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేరిన నిర్మాతలకు చాలా థాంక్స్.. చిన్న సినిమానే అయిన ఒక పెద్ద సినిమా లుక్ ని తీసుకు వచ్చారు.. నిన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చిందనుకుంటునాను.. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది… ట్రైలర్స్ కి, సాంగ్ కి మీరిచ్చిన సపోర్ట్ చూస్తుంటే సినిమా కూడా హిట్ అనిపిస్తుంది.. నన్ను సపోర్ట్ చేసినందుకు నా క్రూ కి చాలా థాంక్స్.. మేమంతా ఎంతో ఇష్టపడి చేసిన సినిమా .. రేపు స్క్రీన్ పైన అందరిని అలరిస్తుంది ఆశిస్తున్నా అన్నారు..

నటీనటులు : సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ , నరేేన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు
సంగీత దర్శకుడు : పూర్ణ చంద్ర తేజస్వీ
డిఓపి : నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్
ఎడిటర్ : సురేష్ ఆరుముగం
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
P.R.O : వంశీ – శేఖర్



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O80H8i

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...