సీనియర్ నటుడు కెప్టెన్ రాజు (68) గుండెపోటుతో మరణించాడు . 500 లకు పైగా చిత్రాల్లో నటించిన కెప్టెన్ రాజు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినవాడు అయినప్పటికీ తమిళ , తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు . ఆర్మీ లో పనిచేసిన కెప్టెన్ రాజు నాటకాలు , సినిమాల మీద మక్కువతో ఆర్మీ కి రాజీనామా చేసి నాటకాలపై మొదట ఆసక్తి ప్రదర్శించాడు అనంతరం సినిమాల్లో ఛాన్స్ రావడంతో 500 కు పైగా చిత్రాల్లో నటించాడు . ఎక్కువగా అన్ని పాత్రలు కూడా విలన్ వి కావడం గమనార్హం . మంచి ఆజానుబాహుడు కావడంతో ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చాయి కెప్టెన్ రాజు కు .
మాతో పెట్టుకోకు , గాండీవం , శత్రువు , బలిదానం , రౌడీ అల్లుడు , మొండిమొగుడు పెంకి పెళ్ళాం , కొండపల్లి రాజా , జైలర్ గారి అబ్బాయి తదితర తెలుగు చిత్రాల్లో నటించాడు . అంతేకాదు నటుడిగానే కాకుండా మలయాళంలో 2 చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు . గుండెపోటుతో మరణించిన కెప్టెన్ రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .
English Title: Actor captain raju passed away
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OBvSJe
Comments
Post a Comment