Skip to main content

ఘనం గా మను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక..!!

manu movie pre release eventషార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్ – చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘మను’.. ఈ నెల 7 న విడుదల కానున్న ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రముఖ దర్శకుడు క్రిష్ , కేరాఫ్ కంచరపాలెం మూవీ దర్శకుడు మహా వెంకటేష్ లు ముఖ్య అతిధులుగా , హీరో వరుణ్ తేజ్ వచ్చిన ఈ కార్యక్రమం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.. పల్లకిలో పెళ్లికూతురు, బసంతి చిత్రాల తర్వాత రాజా గౌతమ్ నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి..

దర్శకుడు మహా వెంకటేష్ మాట్లాడుతూ.. నా సినిమా కేరాఫ్ కంచరపాలెం కు ఈ సినిమా చాల కో ఇన్సిడెంట్ లు జరిగాయి.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతుండం కో ఇన్సిడెంట్ కాదు డెస్టినీ.. ఈ సినిమా ట్రైలర్ ని చాల బాగా డిజైన్ చేసాడు.. ఇంతవరకు అలాంటి ట్రైలర్ చూడలేదు.. ఇద్దరం కలిసి వస్తున్నాము.. ఇద్దరం కలిసి సక్సెస్ కొడదాం.. అన్నారు..

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 న వస్తున్న చాల గొప్ప సిఎంమాలు.. కేరాఫ్ కంచరపాలెం.. మను.. ఈ రెండు సినిమాలు చాల గొప్ప సినిమాలు అవుతాయని నమ్మకం నాకుంది.. గౌతమ్ ఈ సినిమాలో చాల బాగా యాక్ట్ చేసాడని అనిపిస్తుంది.. ఈ సినిమా కోసం అతను చాల కష్టపడ్డాడని తెలుస్తుంది.. ఈ మను సినిమా చూస్తున్నపుడు ఎంతో థ్రిల్ గా అనిపించింది.. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు ఇలాంటి సినిమా తీయాలనిపిస్తుంది.. ఎవ్రి డిపార్ట్మెంట్ చాల హానెస్ట్ గా సినిమా తీశారు.. సినిమాకి ఫండ్ ఇచ్చిన 112 సినిమా ప్రియులకు మంచి హిట్ దక్కాలని కోరుకుంటున్నాను..

నిర్మాత సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీం తో పనిచేసినందుకు చాల హ్యాపీ గా ఉంది.. అందరికి నా కృతజ్ఞతలు..సినిమా బ్యాక్ గ్రౌండ్ కానీ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, యూ ఎస్ లో ఉంది మాకు సప్పోర్ట్ చేసిన వారికీ స్పెషల్ థాంక్స్.. మీ సపోర్ట్ తో ఇలాంటి మంచి సినిమాలు తీస్తానని అన్నారు..

నిర్మాత సృజన మాట్లాడుతూ.. మా బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడే మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాము.. అలాంటిదే మను.. ఈ సెప్టెంబర్ 7 వచ్చిన ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలనీ అందరిని కోరుకుంటున్నాను..

ఈ సందర్భంగా చిత్ర హీరో గౌతమ్ మాట్లాడుతూ.. అందరికి ఇక్కడికి వచ్చినందుకు చాల థాంక్స్.. ఈ సినిమా కి
రెగ్యులర్ ప్రమోషన్స్ కన్నా స్పెషల్ ప్రమోషన్ చేయాలనుకుని డైరెక్ట్ గా జనాల దగ్గరికి వెళ్లాం.. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసిన నాకు లైఫ్ లో గుర్తుండిపోయే సినిమా ఈ మను.. ఈ సినిమా నేను చేసినందుకు చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమాకు నన్ను అనుకునందుకు ఫణి కి చాల థాంక్స్.. ఫణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఒక సినిమాకి అన్ని ఆయనే అయి ఉండి చేస్తారు.. ఫాషన్ అనే పదానికి అయన కృషి సరిపోదు.. ఇంకా పెద్దది కావాలి.. పర్ఫెక్ట్ షాట్ వచ్చేతవరకు కష్టపడుతూనే ఉంటారు.. ఈ సినిమా ని మీరంతా సక్సెస్ చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు..

హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఈవెంట్ కి వచ్చి సినిమాకి సపోర్ట్ చేస్తున్న క్రిష్ గారికి, వరుణ్ గారి కి చాల థాంక్స్.. నిర్వాణం సినిమాస్ సందీప్ రెడ్డి గారు, సృజన గారి స్పెషల్ థాంక్స్.. మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద సపోర్ట్ ఇస్తున్నందుకు మా టీం రుణపడి ఉంటుంది.. ఫనీంద్ర నాకు మధురం షార్ట్ ఫిలిం ద్వారా నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సినిమా అవకాశం ఇచ్చినందుకు ఫనీంద్ర చాల థాంక్స్. నీలా అనే పాత్రలో నన్ను ఎంచుకున్నందుకు హ్యాపీగా ఉంది.. ఇంత మంచి సినిమలో నేను ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది.. అన్నారు..

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చినందుకు అందరికి థాంక్స్.. నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పేకంటే సినిమా ఎలా ఉందొ మీరే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం…క్రౌడ్ ఫండింగ్ అనేది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి.. గౌతమ్ సినిమా కోసం చాల బాగా పనిచేస్తాడు.. ఒక షాట్ కోసం చాల బాగా కష్టపడతాడు.. బ్రహ్మానందం గారి లాంటి స్టార్ ఆక్టర్ కొడుకులా ఎప్పుడు అనిపించలేదు.. చాందిని చౌదరి ని చాల రోజుల తర్వాత కలిశారు.. మొదటి సారి కలిసిన తర్వాత ఇప్పుడు కలిసిన తర్వాత చాల డిఫరెన్స్ వుంది.. సినిమా కోసం చాల కష్టపడింది.. మొదట నేను చుసిన కమిట్మెంట్.. ఫాషన్ ఇప్పుడు వుంది..ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్, ఆర్టిస్ట్ చాల బాగా పనిచేసారు..అన్నారు..

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమాకి పనిచేసిన అందరు చాల బాగా పనిచేసారు.. సినిమాటోగ్రఫీ చాల బాగుంది.. గౌతమ్ చాల కష్టపడ్డాడు.. హీరోగా నిలదొక్కుకోవాలని మొదటి నుంచి ఆయన చాల హార్డ్ వర్క్ చేసాడు.. మను సినిమా గౌతమ్ కోసం హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ఇలాంటి సినిమా చాలా రేర్ గ స్తుంది.. ఇలాంటి సినిమా మంచి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q14dTq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...