Skip to main content

పాటల పల్లకి ప్రోమో సాంగ్ విడుదల

paatala pallaki promo song releaseశ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమం ద్వారా నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో మొగుడ్స్ పెళ్ళాంస్ ఫేమ్స సంగీత దర్శకుడు రాజ కిరణ్ నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దర్శకుడుగా ఎస్. కేశవ్, నిర్మాతగా కె. చిన్న మల్లయ్య, సహా నిర్మాత గా నంది కంటి బాబు రాజు వ్యవహరిస్తున్నారు. ఈ పాటల పల్లకి ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో సాంగ్ ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్లో అత్యుత్తమ సినీ గీత రచయితల సమక్షంలో విడుదల ,చేశారు. ఈ సందర్భంగా

నటుడు మరియు సింగర్ కమల్ మాట్లాడుతూ.. ఎవరికి వాళ్లే తోపు అనుకుంటేనే.. ఇండస్ట్రీలో రాణించగలరు.. కనుక ఇక్కడున్న కొత్త సింగర్స్ ఎవరికి వారే తోపు అనుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నా.. అలానే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్ కిరణ్, బాబు రాజు, చిన్న మల్లయ్య లను అభినందిస్తున్నా అన్నారు.

నిర్మాత చిన్న మల్లయ్య మాట్లాడుతూ.. 4 ఏళ్ల కిందట మా అమ్మాయి శ్రీ ప్రహర్ష పేరున బ్యానర్ ను స్టార్ట్ చేసాము. నాలుగు సినిమాలు చేసాము మొదటిది నా ఊహల్లో 2 నెలల్లో విడుదల కానుంది.. మనసున్నోడు, రాజఖడ్గం సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో పాటల పల్లకి అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది న్యూ సింగర్స్ ను పరిచయం చేయనున్నాము.. కొత్త టాలెంట్ ను వెలికితీసే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్ధ్యంతోనే ముందుకు రావడం జరిగింది అని అన్నారు. రాజ కిరణ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. అందుకే ఆయన సంగీతం సారధ్యంలో వస్తున్న ఈ పాటల పల్లకి ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము.. విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నా అన్నారు సహ నిర్మాత బాబు రాజా.

సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. అలనాడు మహా సంగీత దర్శకులు సమకూర్చిన అద్భుతమైన బాణీలను చిరస్థాయిగా బావి తరాల వారికి కూడా నిలిచి ఉండాలనే ఆశతో అలనాటి పాటలను మరల సమకూర్చి మా ‘పాటల పల్లకి’ ద్వారా పాడాలని ఆశక్తి కలిగి, పాడగల ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి తద్వారా ఎంతో మందికి ఆర్థికంగా కొంచెం సహాయ పడాలనే ఉద్ధ్యంతో ముందుకు సిద్ధం అవుతోంది మా పాటల పల్లకి ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహిస్తున్న ఎస్ కేశవ నా మిత్రుడు.. తానో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.. అలానే ఇంత మంచి కారక్రమానికి నిర్మాతలుగా సహకరించిన బాబు రాజు, చిన్న మల్లయ్యలకు నా కృతఙ్ఞతలు తెలియచేస్తూన్నా అన్నారు.

 

ఈ పాటల పల్లకి ప్రోగ్రామ్ కు హీరో సునీల్ వీడియో ద్వారా అభినందనలు మరియు బెస్ట్ విషెస్ ను అందచేయడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమంలో నూతన గాయని గాయకులతో పాటు వేణు, కిరణ్, జై శ్రీనివాస్, పి. వెంకటేష్, రాంకీ, గురుచరణ్ తదితరులు పాల్గొని పాటల పల్లకి టీమ్ కు అభినందనలు తెలియచేసారు..

పాటల పల్లకి ప్రోగ్రామ్ కు నిర్మాత: కె. చిన్న మల్లయ్య, సహ నిర్మాత: నందికంటి బాబు రాజు, దర్శకత్వం: ఎస్. కేశవ్, సంగీతం: ఎస్. రాజ్ కిరణ్, రచన: రామారావు మాతుమూరు, మేనేజ‌ర్ : వి ఎస్. చారి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PG23aU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...