Skip to main content

“ఎక్ విలన్ 2” లో ఈసారి ఇద్దరు

John Abraham becoming full time villain in Bollywood
John Abraham becoming full time villain in Bollywood

ఆషికీ 2 సినిమా తర్వాత సిద్దార్థ్ మల్హోత్రా &శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ మోహిత్ సూరి తీసిన సినిమా ఎక్ విలన్. మరొక బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఆషికీ 2 మూడ్ లో సూపర్ హిట్ అయ్యింది. అందులో హీరో చచ్చిపోతాడు; ఇందులో హీరోయిన్ చచ్చిపోతుంది. ఆ ఒక్కటే తేడా. ఇక డైరెక్టర్ మొహిత్ సూరి ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోలు; ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలియచేసారు. ఇక మేల్ లీడ్ క్యారెక్టర్స్ కి జాన్ అబ్రాహం, ఆదిత్యరాయ్ కపూర్ ఫైనల్ కాగా, వారి పక్కన సెట్ అయ్యే హీరోయిన్స్ కోసం మూవీ టీం ప్రస్తుతం వర్క్ చేస్తోంది. ఇక ఈ సినిమా కూడా లవ్ జోనర్ క్రైమ్ & యాక్షన్ థీం లో ఉండచ్చని ఆశించవచ్చు. ఇక సినిమా టైటిల్ పరంగా చూస్తే “ఎక్ విలన్ 2” అంటే, ఇద్దరిలో ఒక విలన్ ఉంటారా.? లేక ఇద్దరూ విలన్ షేడ్స్ లో కనిపించే హీరోలా.? లేక ఇంకొక విలన్ క్యారెక్టర్ ని వీరిద్దరి మధ్య ఎంటర్ చేస్తారా.? అని మూవీ లవర్స్ డిస్కషన్స్ చేస్తున్నారు.

మోహిత్ సూరి సినిమా అంటేనే, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, హీరో & హీరోయిన్స్ కెమిస్ట్రీ ప్రధానంగా ఉంటాయి. ఇప్పటికే జాన్ అబ్రహం అటు హీరోగా, ఇటు విలన్ గా రాణిస్తున్నారు. కానీ ఆయన సోలో హీరోగా సినిమా వచ్చి, చాలా కాలం అయ్యింది. బాలీవుడ్ లో సీనియర్ ఖాన్స్ తో పాటు ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహాంను ఇండస్ట్రీ నెమ్మదినెమ్మదిగా విలన్ క్యారెక్టర్లకు అలవాటు చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే జాన్ అబ్రహాం బాలీవుడ్ లో విలన్ గా సెటిల్ అయిపోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3a22EOU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...