కొంత మందికి అందం, అభినయ సామర్థ్యం వున్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. కొంత మందికి ఆ రెండూ లేకున్నా వరుస క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తుంటాయి. టైమ్ కారణమా? లేక వారి అదృష్టం కలిసి రాకనా అన్నది మాత్రం అంతుచిక్కదు. తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన `పులి` సినిమాతో తెరంగేట్రం చేసింది నికీషా పటేల్.
బీబీసీ టీవీ షోస్‌లో పాల్గొన్న నికీషా `పులి` సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడిపోయింది. ఇప్పటికీ తెలుగులో సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. కల్యాణ్‌రామ్‌తో చేసిన `ఓమ్ త్రీడీ`, సాయిరాంశంకర్‌తో చేసిన `అరకు రోడ్‌లో..` గుంటూర్ టాకీస్ 2` చిత్రాలు కూడా ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌ని వదిలేసి కోలీవుడ్‌కు మకాం మార్చేసింది.
అరవిందస్వామితో భాస్కర్ ఒరు రాస్కెల్, మార్కెట్ రాజా ఎంబీబీఎస్, అయిరమ్ జన్మాంగల్ చిత్రాల్లో నటించింది. ఇలా కూడా పేరు రాకపోవడంతో సోషల్ మీడియాని నమ్ముకుంటోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు అందు బాటులో వుంటోంది. తాజాగా నికీషా పటేల్ షేర్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాతో పాటు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసైనా స్టార్ హీరోలు, డైరెక్టర్‌లు నికిషాకు అవకాశాలిస్తారేమో చూడాలి.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3aToTY3
Comments
Post a Comment