పెద్ద సినిమాలలో, హిట్ సినిమాలలో బాగా రిజిస్టర్ అయిన సినిమా పాటలలో లిరిక్స్ లైన్ తీసుకుని ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలకు టైటిల్ గా పెట్టుకోవడం ఒక సెంటిమెంట్ అయ్యింది ఇండస్ట్రీలో. ఇది మొదలుపెట్టిన వాళ్ళలో సక్సెస్ అయ్యింది యంగ్ హీరో నితిన్. ఇప్పుడు అదే తరహాలో నాగశౌర్య హిట్ సినిమా “చలో” లో బాగా హిట్ అయిన పాట “చూసీ చూడంగానే.” ఈ పాట కూడా మనకు తెలియకుండానే 100 మిలియన్స్ దాటేసింది.
ఇప్పుడు ఆ పాట టైటిల్ గా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారి తనయుడు శివ కందుకూరి హీరోగా ఒక సినిమా వస్తోంది. ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అవుతోంది. శేష సింధు రావు గారు దర్శకురాలిగా ఈసినిమాతో పరిచయం అవుతున్నారు. ఎన్నో పెద్ద తెలుగు సినిమాలకు మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గోపీ సుందర్ గారు ఈ చ్నిమాకు అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. ఎడిటర్ రవితేజ గిరిజాల వంటి టెక్నీషియన్స్ ఈసినిమాకు పనిచేసారు. ఒక నిర్మాతగా సినిమాల పట్ల, కథలపట్ల మంచి అభిరుచి, అవగాహన ఉన్న రాజ్ కందుకూరి ఈ సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ప్రేమ కథలలో ఒక విలక్షణత ఆయన సినిమాల్లో మనం గమనించవచ్చు. ఇక ఆయన గత చిత్రాలైన పెళ్లి చూపులు, మెంటల్ మదిలో తరహాలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RT2Ms0
Comments
Post a Comment