కర్ణాటక మైసూర్‌లోని బండీపూర్ అడవుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న 168 సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారా? అంటే తమిళ చిత్ర వర్గాలు లేదనే సమాధానం చెబుతున్నాయి. బండీపూర్ అడవుల్లో తలైవా సినిమా షూటింగ్ కోసం వెళ్లలేదని `మ్యాన్ వర్సెస్ వైల్డ్` షో కోసం వెళ్లారని తెలిసింది.
గతంలో ప్రధాని మోదీతో బేర్‌గ్రిల్స్ డిస్కవరీ ఛానల్ కోసం మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ అడ్వెంచర్‌ని చేసిన విషయం తెలిసిందే. ఈ సారి రజనీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందు కోసం కర్ణాటక మైసూర్‌లోని బండీపూర్ అభయారణ్యాన్ని వేదికగా చేసుకున్నారు బేర్‌గ్రిల్స్. మోదీతో ఉత్తరాఖండ్‌లోని జాతీయ పార్కులో అడ్వెంచర్ యాత్ర చేసిన బేర్‌గ్రిల్స్ తాజాగా రజనీతో మాత్రం బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్‌లో మూడు మంగళ, బుధ, గురు వారాలు షూటింగ్ చేస్తున్నారు.
రోజులకు ఆరు గంటల పాటు ఈ షూటింగ్ రగనుందని తెలిసింది. అయితే ఈ షూట్ కోసం కర్ణాటక అటవీ శాఖ వారు బేర్‌గ్రిల్స్ కు 17 నిబంధనల్ని విధించారట. మంగళ, బుధవారాలు మాత్రం రజనీపై షూటింగ్ చేస్తారట. గురువారం ఖిలాడీ హీరో అక్షర్‌కుమార్ ఎంటర్ అవుతారని, అక్షయ్, రజనీలపై గురువారం బేర్ గిల్స్ టీమ్ డాక్యు మెంటరీని చిత్రీకరిస్తుందట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S8q90T
Comments
Post a Comment